For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ’ (ఫోటోలు)

By Nageswara Rao
|

టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా చిన్న కంపెనీల్లో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రతన్ టాటా ఆన్‌లైన్ మీడియా సంస్థ యువర్‌ స్టోరీలో పెట్టుబడి పెట్టారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారనేది మాత్రం తెలియరాలేదు. స్టార్టప్స్‌ ప్రొఫైల్‌ స్టోరీలు, ఎంటర్‌ప్రెన్యూర్ల విజయగాధలను ‘యువర్‌ స్టోరీ' రాస్తోంది.

వీటికి ప్రపంచ వ్యాప్తంగా విశేషాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రతన్‌ టాటా ఆకర్షితులైన పెట్టుబడి పెట్టారు. ఓలా, పేటీఎం, స్నాప్‌డీల్‌, అర్బన్‌ లాడర్‌, బ్లూస్టోన్‌, కార్‌దేఖో వంటి కంపెనీల్లో రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

గతంలో టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబుడలు పెట్టారనేది మాత్రం తెలియరాలేదు. బాంబే ఐఐటికి చెందిన భవిష్‌ అగర్వాల్‌, అంకిత్‌ భట్టి ప్రమోట్‌ చేసిన ఓలా కంపెనీ ఈక్విటీలో రతన్‌ టాటా వాటా తీసుకున్నారు.
రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

వ్యాపార విస్తరణ కోసం 40 కోట్ల డాలర్లు (సుమారు రూ.2,560 కోట్లు) సమీకరించబోతున్నట్టు ఓలా కంపెనీ ప్రకటించిన మూడు నెలల్లోనే రతన్‌ టాటా ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ఈ ఓలా ప్రస్తుతం మార్కెట్ విలువ 250 కోట్ల డాలర్లకు చేరుకుంది.

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

రతన్ టాటా ఇప్పటికే వ్యక్తిగత హోదాలో స్నాప్‌డీల్‌, కార్‌దేఖో, పేటిఎం, అర్బన్‌ లాడర్‌ వంటి స్టార్టప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ జియోనీలో కుడా రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

 రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ'

సాప్ట్‌వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే చిన్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన తమిళ ఔత్సాహికురాలు అన్నామలై హేమలతకు టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా అండగా నిలబడ్డారు. ఆమె ప్రారంభించినన సంస్ధ 'ఆంపిరే' సంస్ధ భవిష్యత్తులో ఉన్నత స్ధితికి చేరుకుంటుందని భావించిన ఆయన పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టారు. కోయంబత్తూరు ప్రధాన కేంద్రంగా హేమలత 'ఆంపిరే' అనే కంపెనీని స్ధాపించారు.

English summary

రతన్ టాటాను ఆకట్టుకున్న ‘యువర్ స్టోరీ’ (ఫోటోలు) | Ratan Tata reads YourStory, and writes a cheque for it

YourStory, an online media entity that profiles start-ups and entrepreneurs, has raised an undisclosed amount from Ratan Tata, chairman emeritus of Tata Sons.
Story first published: Tuesday, August 18, 2015, 12:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X