For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

By Nageswara Rao
|

దేశంలో అతిపెద్ద టెలికం సర్వీసుల సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు డేటా వ్యాపారం దన్నుగా నిలవడంతో పాటు టవర్ల విక్రయం కలిసిరావడంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40 శాతం ఎగబాకి రూ.1,554.3 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.

గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 1,108 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగం భారీగా పుంజుకోవడం, విదేశాల్లో ఉన్న టవర్ల ఆస్తులు విక్రయించడం లాభాలు పుంజుకోవడానికి దోహదపడ్డాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ విక్రయాలు 2.9 శాతం మాత్రమే పెరిగి రూ.23,680.80 కోట్లకు చేరాయి. మొబైల్ డేటా వినియోగం 67.3 శాతం పెరిగి రూ. 2,603 కోట్లకు ఎగబాకింది.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఉగాండా, ఘనా, కాంగో బ్రాజావిల్లే, నైజీరియాలో టవర్ల విక్రయం వల్ల కంపెనీకి త్రైమాసికంలో రూ. రూ.2,268.7 కోట్ల నిధులు సమకూరాయి. జూన్ 30 నాటికి వినియోగదారుల సంఖ్య 33.18 కోట్లకు చేరారు.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ నికర రుణాలు రూ.68,134.5 కోట్లగా నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల్లో ఆఫ్రికాలో టెలికం సర్వీసులు అందించడం ద్వారా రూ. 976.8 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఇదే సమయంలో ఆదాయం రూ. 6,159.5 కోట్లకు పరిమితమైంది. డేటా వినియోగదారుల సంఖ్య 25.8 శాతం పెరిగి 4.95 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

క్యూ1 ఫలితాల సందర్భంగా సంస్ధ ఎండీ, సీఈఓ గోపాల్ మాట్లాడుతూ వినియోగదారుల సంఖ్యలో స్ధిరమైన వృద్ధి కొనసాగిందన్నారు. మొబైల్ నిమిషాలు, డేటా వినియోగం 7.4, 83.4 శాతం పెరిగాయన్నారు.

అన్ని వ్యాపార విభాగాల్లో ఆదాయాలు అభివృద్ధి చెందినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

దేశీయంగా ఆదాయం 10 శాతం పెరిగింది. ఎయిర్‌టెల్, డిజిటల్ టీవీ వ్యాపారాల్లో వరుసగా 22.2, 15.8 శాతం వృద్ధి సాధించింది. ఇక మొబైల్ డేటా ఆదాయం వాటా సగటు వినియోగదారుడిపై రూ. 42 పెరిగి రూ. 181కు చేరింది.

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం

మరోవైపు భారత్‌లో మొత్తం ఎయర్ టెల్ వినియోగదారుల సంఖ్య 10 శాతం పెరిగి 23 కోట్లకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ టెల్ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న 20 దేశాల్లో వీరి సంఖ్య 33.18 కోట్లుగా ఉంది.

English summary

ఎయిర్‌టెల్‌కు డేటా దన్ను: లాభం 40 శాతం | Bharti Airtel gains as Q1 net profit jumps 40%

Shares of Bharti Airtel gained 3.35 per cent in trade on Wednesday, a day after the company beat Street expectations and posted a 40 per cent jump in net profit in the April-June quarter of the ongoing financial year.
Story first published: Wednesday, August 5, 2015, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X