For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ Q4 ఫలితాలు: నికర లాభం 3,742 కోట్లు

By Nageswara Rao
|

భారతీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐస్‌బీఐ) 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను నాల్గవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి 31తో ముగిసిన ఈ త్రైమాసికానికి గాను 23 శాతం వృద్ధితో రూ. 3,742 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బీఐ నమోదు చేసింది.

మొత్తంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ. 13,101 కోట్ల నికరలాభాన్ని ఎస్‌బీఐ నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 4.25 శాతం వృద్ధి సాధిస్తే ఈ త్రైమాసికంలో 4.90 శాతాన్ని నమోదు చేసింది.

SBI Reports Good Q4 Numbers As NPAs Fall; Shares Rally Sharply

స్నాప్‌డీల్‌, పేపాల్‌తో చేతులు కలిపిన ఎస్‌బీఐ

చిన్న, మధ్య తరహా సంస్థలకు(ఎస్‌ఎంఈ) తోడ్పాటు కోసం ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం స్నాప్‌డీల్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేపాల్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చేతులు కలిపింది. స్నాప్ డీల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వెబ్‌సైట్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎస్‌బీఐ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తుంది.

ఈ సందర్భంగా ఎస్‌‌బీఐ ఛైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య మాట్లాడుతూ నిధుల సమస్య వల్ల వ్యాపారాలను విస్తరించలేకపోతున్న ఎస్‌ఎంఈలకు మంచి ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. తమ ఎస్‌ఎంఈ కస్టమర్లు ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా, సులభతరంగా నిర్వహించుకునేలా పేపాల్‌తో ఎస్‌బీఐ ఎంవోయూ కుదుర్చుకుందని ఆమె పేర్కొన్నారు.

English summary

ఎస్‌బీఐ Q4 ఫలితాలు: నికర లాభం 3,742 కోట్లు | SBI Reports Good Q4 Numbers As NPAs Fall; Shares Rally Sharply

State Bank of India (SBI's) reported a superb set of numbers for the quarter ending March 31, 2015 (Q4 2015) with net profits jumping and non performing assets showing sharp improvement.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X