For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ రేటు తగ్గింపు: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ హోం లోన్స్ ఇక చౌక

By Nageswara Rao
|

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై వడ్డీరేటును 0.25 శాతం వరకు తగ్గించింది. దీంతో మహిళలకు వర్తించే వార్షిక వడ్డీరేటు 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గగా, మిగతావారికి వర్తించే వడ్డీరేటు 10.15 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గింది.

తగ్గిన వడ్డీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా గృహరుణం తీసుకునే వారికి వడ్డీరేటు భారీగా తగ్గనుంది. ఎందుకంటే గత శుక్రవారం ఎస్‌బీఐ బేస్ రేటు 0.15 శాతం తగ్గింది. అంటే బేస్‌రేటుతో అనుసంధానితమైన గృహ రుణాలపాటు మిగతా రుణాలన్నింటికీ (కొత్తగా తీసుకునేవి, గతంలో తీసుకున్నవాటికీ) ఈ తగ్గింపు వర్తిస్తుంది.

Interest On Home Loans Become Cheaper As HDFC, SBI Cut Rates

తాజాగా గృహరుణరేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఈనెల 13 నుంచి హోమ్‌లోన్ తీసుకునేవారికి 0.10 శాతం అదనపు లబ్ధి చేకూరనుంది. మహిళల కోసం బ్యాంకు హెర్ ఘర్ పేరుతో ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బేస్ రేటు తగ్గింపుతో ఈ పథకం ద్వారా 30 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్న గృహ రుణంపై రూ. లక్షకు చెల్లించే ఈఎంఐ రూ. 885 నుంచి రూ. 867కు తగ్గనుంది. మిగతావారికి నెలవారీ ఈఎంఐ రూ. 889 నుంచి రూ. 871కి తగ్గనుంది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా రెండు రోజుల క్రితమే గృహరుణం రేటును 0.20 శాతం తగ్గించింది. దీంతో సంస్థ వార్షిక వడ్డీరేటు 9.9 శాతానికి తగ్గింది. కొత్తగా లోన్ తీసుకునేవారితోపాటు గతంలో రుణం పొందినవారికి కూడా తగ్గింపు వర్తిస్తుందని ఒక ప్రకటనలో హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

English summary

వడ్డీ రేటు తగ్గింపు: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ హోం లోన్స్ ఇక చౌక | Interest On Home Loans Become Cheaper As HDFC, SBI Cut Rates


 The country's largest lender, State Bank of India (SBI) cut interest rate on home loans to 9.90 per cent, while dropping it further to 9.85 per cent for women borrowers.
Story first published: Monday, April 13, 2015, 19:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X