For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీలు ఎన్‌సీడీల వల్లే సాధ్యం?

By Nageswara Rao
|

చాలా మంది పెట్టుబడిదారులు కొన్ని కొన్ని సంస్ధల్లో ఎందుకు పెట్టుబడులు పెడతారో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఒక్కోటప్పుడు నష్టాలు వస్తాయని తెలిసినా కూడా పెట్టుబడులు పెడుతుంటారు. ఏ సందర్భంలో మీరు పెట్టుబడులు పెట్టినా కూడా మీకు లాభాలనిచ్చేవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్:

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్ అయి ఉండి, బ్యాంకులు ప్రస్తుతం ఇస్తున్న 4-5 శాతం రిటర్న్స్ కంటే అత్యధికంగా 15 శాతం వరకు రిటర్న్స్‌ను అందిస్తాయి. కొంత మంది వడ్డీకి ఇస్తే జనాలు ఎక్కడ మోసం చేస్తారనే భయంతో బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుని తక్కువ వడ్డీని పొందుతుంటారు. అలాంటి వారి కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ సరిగ్గా సరిపోతాయి.

How NCDs Can Offer You Better Returns Than Bank Deposits?

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏమిటి? ఎక్కడ కొనుగోలు చేయొచ్చు?

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి కంపెనీలు వాటి యొక్క నగదుని పెంచుకునేందుకు అందించబడేవి. వీటి ద్వారా ఫిక్స్‌డ్ వడ్డీ రేటుని పొందవచ్చు. శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్, ముత్తూట్ ఫైనాన్స్, ఎస్ఆర్ఈఐ లాంటి కంపెనీలు వీటి ద్వారా డబ్బుని పెంపొదించుకుంటాయి.

ఈ కంపెనీలు అన్ని కూడా స్టాక్ ఎక్సేంజ్‌లో లిస్ట్ కాబడి ఉంటాయి. సాధారమంగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 10-13 వరకు వడ్డీ రేటుని అందిస్తారు. ఉదాహారణకు మణప్పురం పైనాన్స్ ఎన్6 ఎన్‌సీఈ తీసుకోండి. దీనిని జనవరి 28, 2014న ప్రారంభించారు. ఇది 12.5 శాతం వడ్డీరేటుని అందిస్తుంది.

ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 1000 ఉందనుకుందాం. మీరు పొందే వడ్డీ రేటు శాతం కూడా 12.5 శాతం ఉంటుంది. మీరు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ను స్టాక్ ఎక్సేంజ్‌ల వద్ద మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. మీరు అమ్మాలన్నా కూడా అదే విధంగా చేయాలి.

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లపై ట్యాక్స్:

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లపై మీరు పొందిన ఆదాయానికి ట్యాక్స్ వర్తిస్తుంది. బ్యాంకు వడ్డీ రేటుకి ఎలాగైతే ట్యాక్స్ ఉంటుందో అదే విధంగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లపై కూడా ఉంటుంది. బ్యాండు డిపాటిట్స్‌కు టీడీఎస్ అమలవుతుంది కానీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌లకు టీడీఎస్ అమలు కాదు.

స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ల వివరాలు:

Name of NCD Interest Rate
Manappuram Finance Limited N6 series 12.00%
Muthoot Finance N5 series 12.00%
Shriram Transport Finance N9 series 10.25%
Shriram Transport Finance N6 series 9.75
Muthoot Finance N6 series 12.25%
Shriram City Union N2 series 11.85%

English summary

బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీలు ఎన్‌సీడీల వల్లే సాధ్యం? | How NCDs Can Offer You Better Returns Than Bank Deposits?

Investors are generally wary of investing in any instrument that is difficult to understand, even if it means losing out on interest and returns.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X