For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహారా ఆఫీసులపై ఐటీ దాడులు, రూ.135 కోట్లు స్వాధీనం

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతో రాయ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, నోయిడాల్లోని సంస్థ కార్యాలయాలపై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.135 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

‘I-T department seizes Rs 137 crore in cash from Sahara premises’
స్వాధీనం చేసుకున్న నగదు అంతా విదేశాల నుంచి ఢిల్లీలోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు బదిలీ అయిందిగా ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటిదాకా తాము జరిపిన దాడుల్లో ఇంత పెద్ద మొత్తం నగదు లభించడం ఇదే ప్రథమమని దాడుల తర్వాత ఆ శాఖాధికారులు వెల్లడించారు. ఈ నెల 22న జరిగిన ఈ సోదాల విషయం కాస్త ఆలస్యంగా సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.

నల్లధనంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ విషయమై నివేదిక అందిచామన్నారు. ఈ విషయంపై సహారా గ్రూప్‌ను సంప్రదించగా... అంత నగదు కాదంటూనే, ఆ సొమ్ము అంతా చట్టబద్ధమైనదే అని తెలిపింది.
ఏడాది కాలంగా తమ ఆస్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయని, 20 నెలలుగా తమ ఖాతాలన్నింటినీ స్తంభింప చేశారని, వాటిల్లోని నగదును సెబీకి చెల్లించినట్లు సహారా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు.

అత్యవసరాల కోసం చట్టబద్దమైన నగదును వేరువేరు ప్రాంతాల్లో సహారా సంస్ధ నిల్వ ఉంచినట్లు తెలిపారు. సహారా కార్యాలయాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలున్నాయన్న ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో ఆదాయపన్ను శాఖ ఈ దాడులు చేసింది.

English summary

సహారా ఆఫీసులపై ఐటీ దాడులు, రూ.135 కోట్లు స్వాధీనం | ‘I-T department seizes Rs 137 crore in cash from Sahara premises’

Income tax authorities have seized Rs 137 crore in cash in the two-day raids carried out on the premises of the Sahara Group in Delhi and Noida, sources in the department said. It's the biggest cash seizure in a single case.
Story first published: Tuesday, November 25, 2014, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X