For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బిఐ

|

ముంబై: మాన్‌సూన్‌పై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆహార ద్రవ్యోల్బణాన్ని అరికట్టే విధంగా ఉండనున్నాయని మంగళవారం ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష అనంతరం రిజర్వు బ్యాంక్ అభిప్రాయపడింది.

కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని ప్రకటించింది. 2015 జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. 2016 జనవరి వరకు 6శాతానికి కట్టడి చేస్తామని తెపారు. కాగా, రిజర్వు బ్యాంకు ఎస్‌ఎల్‌ఆర్‌ను ఆర్‌బీఐ 0.5 శాతానికి తగ్గించింది.

Monsoon delay could stoke food inflation: RBI

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.5శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పారు. తాము ధరల పెరుగుదలపై లోతుగా పరిశీలిస్తున్నామని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ప్రభుత్వం చేపట్టబోయే చర్యలు, పలు ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఆహార సప్లై పెరిగే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ తెలిపింది.

ఆహార రంగంపై నూతన ప్రభుత్వం సంస్కరణలు చేపట్టనుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ఎఫ్‌సిఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ల పునర్నిర్మాణం, రవాణాను తగ్గించడం, పంపిణీ, పిడిఎస్‌ల పనితీరును మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోనుందని తెలిపింది. వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం గత ఏప్రిల్‌లో 8.59 శాతంగా ఉందని.. అది మేలో 8.28శాతానికి తగ్గిందని తెలిపింది. జూన్‌లో అది 7.31శాతానికి తగ్గిందని వెల్లడించింది.

English summary

కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బిఐ | Monsoon delay could stoke food inflation: RBI

The Reserve Bank cautioned that continued uncertainty over monsoon could stoke food inflation, but expressed the hope that government policies will improve supplies in the coming months.
Story first published: Tuesday, August 5, 2014, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X