For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టిలో ఇంటర్నేషనల్ ఫార్మాసిటీ: కెసిఆర్(పిక్చర్స్)

|

హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు తెలిపారు. హైదరాబాద్ పొలిమేరల్లో ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీని నిర్మిస్తామని, దానివల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బుధవారం ఆయన డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైల్వే ట్రాక్, నేషనల్ హైవే, నీరు అందుబాటులో ఉన్న చోట ఫార్మా సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఐదు వేల ఎకరాలలో ఫార్మా కంపెనీలు, మరో రెండు వేల ఎకరాలలో అందులో పని చేసే వారికి నివాసాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఫార్మా కంపెనీలలో లక్ష మంది పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఫార్మా సిటీ ఏర్పాటు చేసిన తర్వాత జీడిమెట్లలో ప్రస్తుతం ఉన్న కంపెనీలను కూడా అక్కడికే తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫార్మా సిటీకి ప్రత్యేకంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ కన్సల్టెంట్లతో ఫార్మాసిటీకి ప్రణాళిక తయారు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్మారంగం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్టు కూడా ఆయన తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని, వీటి విలువ రూ. 65.16 కోట్లు ఉండగా, ఇందులో 32.58 కోట్ల రూపాయల మందులు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో డ్రగ్స్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు జయంత్ ఠాగూర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్‌కె అగర్వాల్, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కెసిఆర్

కెసిఆర్

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్ పొలిమేరల్లో ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీని నిర్మిస్తామని, దానివల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైల్వే ట్రాక్, నేషనల్ హైవే, నీరు అందుబాటులో ఉన్న చోట ఫార్మా సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.

English summary

టిలో ఇంటర్నేషనల్ ఫార్మాసిటీ: కెసిఆర్(పిక్చర్స్) | KCR moots Pharma city in Hyderabad

Chief Minister K. Chandrasekhar Rao informed a delegation of bulk drug manufacturers that one or a group of pharma cities will come up around Hyderabad over 7,000 to 8,000 acres close to the national highway and a railway track.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X