For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ ఓ సూపర్ హైవే: దావోస్‌లో ఫ్రెడ్‌మన్

|

Thomas Friedman
దావోస్: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతున్న భారత్‌కు అభివృద్ధి పథంలో పరుగులు తీసే సామర్ధ్యం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త థామస్ ఫ్రైడ్‌మన్ బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆయన ‘సూపర్ హైవే'గా అభివర్ణించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగించించారు. ఈ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం కూడా హాజరయ్యారు.

భారత్‌పైనే తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు థామస్ వివరించారు. భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల గురించి అనేక మంది తరచూ నన్ను అడుగుతూ ఉంటారని తెలిపారు. తన దృష్టిలో ఇవి రెండూ సూపర్ హైవేల్లాంటివేనని చెప్పారు. అయితే ఇవి కొంచెం క్లిష్టమైనవని పేర్కొన్నారు. భారత్‌లో తగినంతగా రక్షణలు లేకపోయినప్పటికీ అక్కడ వ్యాపారంలో లాభసాటిగా దూసుకుపోయేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని థామస్ ఫ్రైడ్‌మన్ స్పష్టం చేశారు.

థామస్ ఫ్రైడ్‌మన్ రచించిన ‘ది వరల్డ్ ఈజ్ ఫ్లాట్' అనే పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విషయం తెలిసిందే.
సమావేశానికి హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఉన్నట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి సాధన దిశగా పురోగమిస్తుందని అన్నారు.

తాము మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఏడాదిన్నర నుంచి పలు నిర్ణయాలు తీసుకున్నామని, వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని చిదంబరం తెలిపారు. తాము తీసుకున్న పలు చర్యల ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం వచ్చిందని ఆయన చెప్పారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం చేయకుండా ఉండడంతో పాటు మరింత నిర్ణయాత్మకంగా వ్యహరించినట్టయితే మూడేళ్లలో ఎనిమిది శాతం వృద్ధి రేటులో ప్రవేశించడం ఖాయమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఆదాయాల అసమానతలు, మధ్యతరగతిలో స్తబ్ధత ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇబ్బందులు కలగజేస్తాయని ఆయన విశ్లేషించారు. పేదరిక రేఖ నుంచి ప్రజలను వెలుపలికి తీసుకువచ్చే విషయంలో చైనా, భారత్ రెండూ మెరుగైన పనితీరునే ప్రదర్శిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆహార ద్రవ్యోల్బ ణం పెరిగిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటని అన్నారు. ఆదాయాల్లో అసమానతలు తొలగించేందుకు తాము చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నదని చిదంబరం పేర్కొన్నారు.

English summary

భారత్ ఓ సూపర్ హైవే: దావోస్‌లో ఫ్రెడ్‌మన్ | Indian economy is like a super highway: Friedman


 Comparing the Indian economy to a super highway, noted economist Thomas Friedman has said he is optimistic about the growth potential of the country, which remains a true democracy.
Story first published: Friday, January 24, 2014, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X