For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా గ్రూప్‌పై భాటియా మండిపాటు

|

 AirAsia JV
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో చేతులు కలిపి దేశీయ విమానయాన రంగంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించడం అనైతికమని ఎయిర్ ఏషియా ఇండియాలో భాగస్వామిగా ఉన్న అరుణ్ భాటియా అన్నారు. ఇప్పటివరకు సింగపూర్ ఎయిర్ లైన్స్(సియా)తో టాటా గ్రూప్ ఒప్పందం కుదుర్చుకోవడం తనకు తెలియదని అన్నారు. కాగా సియాతో ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ ఏషియా యాజమాన్యానికి ముందే తెలుసని టాటా సన్స్ స్పష్టం చేసింది.

మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా, టాటా సన్స్, భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్ ప్లేస్‌లు కలిసి దేశంలో చౌక విమానయాన సేవలందించేందుకు ఎయిర్ ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ఇందులో టాటా సన్స్‌కు 30శాతం వాతా ఉంది. సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో, ఎయిర్ ఏసియా సంస్థలతో టాటా గ్రూప్‌కు భాగస్వామ్యం ఉన్నందున వ్యవహారాల గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని భాటియా అభిప్రాయపడ్డారు.

సెప్టెంబర్ 28న జరగనున్న కంపెనీ బోర్డు సమావేశంలో తాజా పరిణామాలను భాగస్వామ్య సంస్థలతో చర్చించనున్నట్లు తెప్పారు. కాగా టాటా గ్రూప్, సియాల ఒప్పందం ప్రతిపాదనకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కొత్త కంపెనీకి అనుమతుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి)కి దరఖాస్తు చేసుకున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది.

సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో కలిసి ఏర్పాటు చేయనున్న కొత్త విమానయాన సంస్థకు ‘టాటా సియా ఎయిర్ లైన్స్ లిమిటెడ్'గా పేరు నమోదు చేస్తామని, కంపెనీ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు పెట్టుకున్నట్లు టాటా గ్రూప్ వర్గాలు తెలిపాయి. మొదట 10కోట్ల డాలర్ల పెట్టుబడితో కొత్త ఎయిర్ లైన్స్‌ని ప్రారంభించే అవకాశముందని టాటా గ్రూప్ తెలిపింది.

కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానయాన సంస్థలో టాటా సన్స్‌కి 51శాతం, సింగపూర్ ఎయిర్ లైన్స్‌కి 49శాతం వాటాలుంటాయి. సంస్థకు చెందిన ముగ్గురు సభ్యుల బోర్డులో టాటా సన్స్ నుంచి ఇద్దరు, సింగపూర్ ఎయిల్స్ నుంచి ఒకరు ఉంటారు. ఈ బోర్డుకు ప్రసాద్ మీనన్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆయన టాటా క్వాలిటీ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఛైర్మన్‌గా ఉన్నారు.

English summary

టాటా గ్రూప్‌పై భాటియా మండిపాటు | Tata-SIA venture irks AirAsia JV partners

On a day when union aviation minister Ajit Singh cleared the AirAsia India proposal to launch a low cost airline in India, cracks appeared in the relationship between its joint venture partners - AirAsia, Arun Bhatia and the Tatas.
Story first published: Saturday, September 21, 2013, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X