For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవైసీ నిబంధనలు పాటించని 22 బ్యాంకులకు రూ. 49.5 కోట్ల జరిమానా

By Nageswara Rao
|

Reserve Bank of India
న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌పై ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన నేపధ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కొన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. కస్టమర్ల వివరాల వెల్లడి (కేవైసీ), మనీ లాండరింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘన క్రింద 22 బ్యాంకులకు నిన్న రూ. 49.5 కోట్ల జరిమానా విధించింది. వీటిల్లో పలు ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పీఎన్‌బీ, ఎస్‌బీఐ బ్యాంకులు ఉన్నాయి. సిటీబ్యాంక్, స్టాన్‌చార్ట్ బ్యాంకులతో సహా 7 బ్యాంకులకు వార్నింగ్ లెటర్స్ ఆర్‌బీఐ పంపించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు రూ. 10.5 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కేసు వివరాలను పరిశీలించిన తర్వాత 22 బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలిందని.. అందుకే వాటికి జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఐతే మనీ లాండరింగ్ జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో ఆధారాలు లభ్యం కాలేదని, పన్నుల విభాగం తదితర ఏజెన్సీలు నిర్వహించే విచారణలు ముగిశాక మాత్రమే నిజనిజాలు తెలుస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. దేశంలోని పలు బ్యాంకులు బ్లాక్ మనీని.. వైట్ మనీగా చేసేందుకు గాను కస్టమర్లకు తోడ్పడుతున్నాయంటూ కోబ్రాపోస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా బైటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకుల ఖాతాపుస్తకాలు, అంతర్గతంగా పాటిస్తున్న విధానాలు మొదలైన వాటన్నింటిపై ఏప్రిల్‌లో జరిపిన విచారణ ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ జరిమానా విధించిన బ్యాంకుల వివరాలు:

ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులకు రూ. 3 కోట్ల జరిమానాని ఆర్‌బీఐ విధించింది. యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లక్ష్మి విలాస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంకులకు రూ. 2.5 కోట్ల జరిమానా విధించగా... యస్ బ్యాంక్, విజయా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంకులకు రూ. 2 కోట్ల జరిమానా విధించింది.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

కేవైసీ నిబంధనలు పాటించని 22 బ్యాంకులకు రూ. 49.5 కోట్ల జరిమానా | RBI penalises 22 banks for KYC violation, money laundering | కేవైసీ నిబంధనలు పాటించని 22 బ్యాంకులకు రూ. 49.5 కోట్ల జరిమానా

The Reserve Bank of India (RBI) Monday said it has penalised 22 banks, including the State Bank of India and Punjab National Bank, for violation of know your customer (KYC) norms and money laundering.
Story first published: Tuesday, July 16, 2013, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X