For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రజలు ఆరాధించే కంపెనీల్లో మొదటి స్దానం 'టీసీఎస్' దే

By Nageswara Rao
|

TCS
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ఆరాధించే కంపెనీల రేసులో టాటా గ్రూప్‌కు చెందిన కంపెనీలే మళ్లీ అత్యధిక స్దాయిలో పోటీపడ్డాయి. అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చూన్ మంగళవారం విడుదల చేసిన జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మొదటి స్దానంలో నిలిచింది. గత ఏడాది నెంబర్ వన్ స్దానంలో నిలిచిన టాటా స్టీల్‌ను వెనక్కినెట్టి టీసీఎస్ మొదటి స్దానంలో నిలవడం విశేషం. ఆ తర్వాతి టాప్ 5 స్దానాల్లో హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ నిలవగా.. టాటా స్టీల్ ఏడో ర్యాంక్‌కు జారింది. ఆరవ స్దానంలో ఎల్‌అండ్‌టీ నిలిచింది. ఐటీసీ, ఇన్ఫోసిస్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఆయిల్ దిగ్గజం అయినటువంటి ఓఎన్‌జీసీ ఎనిమిదో ర్యాంక్‌లో నిలవగా, ఆటో దిగ్గజం మారుతీ 9, బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ 10, టెలికం దిగ్గజం భారతీ 19వ స్థానాలను పొందాయి.

ఇక టాప్-50 జాబితాలో మొత్తం నాలుగు టాటా గ్రూప్ కంపెనీలు చోటుదక్కించుకున్నాయి. వీటితోపాటు కోకకోలా, మైక్రోసాఫ్ట్, శామ్‌సంగ్, నోకియా, డెల్, ఇంటెల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు చెందిన ఇండియన్ యూనిట్లు సైతం ఆరాధించే కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కార్పొరేట్ పాలన, కొత్తదనం, సామాజిక బాధ్యతలు, నాయకత్వం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోని అమెరికా మ్యాగజైన్ ఫార్చూన్ ఈ ర్యాంకులను కేటాయించింది.

ఇక పీఎస్‌యూలలో ఐవోసీ 11, సెయిల్ 22, బీపీసీఎల్ 25, ఎన్‌టీపీసీ 28, హెచ్‌పీసీఎల్ 31, గెయిల్ 34, ఓఎన్‌జీసీ విదేశ్ 47, కోల్ ఇండియా 48వ ర్యాంక్‌లో నిలిచాయి. జాబితాలో టాటా గ్రూప్ కంపెనీలు టాటా మోటార్స్(12వ ర్యాంక్), టాటా పవర్(50)కు సైతం చోటు దక్కింది. అంతర్జాతీయ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ ఇండియా 15వ ర్యాంక్‌ను పొందగా, కాల్గేట్ పామోలివ్ 16, ఐబీఎం 17, శామ్‌సంగ్ 18, క్యాడ్‌బరీ 23, డెల్ ఇండియా 32, సీమెన్స్ 36, ఇంటెల్ ఇండియా 38, నోకియా 42, సోనీ ఇండియా 44వ ర్యాంక్‌లో నిలిచాయి.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

ప్రజలు ఆరాధించే కంపెనీల్లో మొదటి స్దానం 'టీసీఎస్' దే | TCS replaces Tata Steel as India's most admired company | ప్రజలు ఆరాధించే కంపెనీల్లో మొదటి స్దానం 'టీసీఎస్' దే

Software giant TCS has replaced its group firm Tata Steel as the country's most admired company, as per a Fortune list released on Tuesday.
Story first published: Wednesday, July 10, 2013, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X