For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశాల్లోని నగదు నేరుగా స్టేట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ మనీ కార్డులోకి

By Nageswara Rao
|

SBI
ముంబై: దేశ, విదేశాల్లో ఉన్న బంధువలు, కుటుంబ సభ్యులు మొదలైన వారి నుండి నగదు పొందే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రీ పెయిడ్ కార్డును ప్రవేశపెట్టింది. యూఏఈ ఎక్స్ఛేంజ్‌తో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కో-బ్రాండెడ్ ప్రి-పెయిడ్ కార్డ్‌ను సోమవారం ఆవిష్కరించింది. స్టేట్ బ్యాంక్ ఎక్స్ ప్రెస్ మనీ కార్డుతో ఏటీఎంలో నగదు డ్రా చేసుకోవడం, కొనుగోళ్లకు చెల్లింపులు వంటి సేవలు పొందవచ్చని ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఆర్ కె షరాఫ్ చెప్పారు.

యూఏఈ ఎక్స్ఛేంజ్‌ ద్వారా భారత్‌కు నగదు పంపినప్పుడు ఆ నగదును ఈ కార్డులో లోడ్ చేసుకోని వినియోగించుకోవచ్చు. రూ. 50 వేల వరకూ ఈ కార్డ్‌లో డబ్బులు లోడ్ చేయవచ్చని, కార్డు పొందిన వ్యక్తి ఒక ఏడాది కాలంలో 30 రెమిటెన్సెస్ స్వీకరించవచ్చని వివరించారు. యూఏఈ ఎక్స్ఛేంజ్ ద్వారా రెమిటెన్స్‌లు ఈ కార్డ్‌లోకి క్రెడిట్ అవుతాయని, దేశంలోని ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులు విత్ డ్రా చేసుకోవడమే కాకుండా.. షాపుల్లో చెల్లింపులకు ఈ కార్డుని ఉపయోగించవచ్చని అన్నారు. వీటితో పాటు ఈ కామర్స్ లావాదేవీలు కూడా జరపొచ్చు. స్టేట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ మనీ కార్డ్ పేరుతో అందిస్తున్న ఈ కార్డ్ ప్రవాసుల నుంచి రెమిటెన్సెస్ స్వీకరించే వారికి బ్యాంకింగ్ సర్వీసులందిస్తుందని అన్నారు.

వన్ఇండియా మనీ తెలుగు

English summary

విదేశాల్లోని నగదు నేరుగా స్టేట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ మనీ కార్డులోకి | SBI launches State Bank Xpress Money Card | విదేశాల్లోని నగదు నేరుగా స్టేట్ బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ మనీ కార్డులోకి

State Bank of India, in partnership with a non-banking finance company, UAE Exchange and Financial Services, has launched a card which will enable the holder to receive the remittance directly on the card.
Story first published: Tuesday, July 9, 2013, 12:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X