For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

By Nageswara Rao
|

ముంబై: ఆర్దిక వ్యవస్దలో వడ్డే రేట్లు తగ్గడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఐతే కొన్ని ప్రభుత్వ బ్యాంకులు మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద భారీ మొత్తంలో వడ్డే రేట్లను చెల్లిస్తున్నాయి. సాధారణంగా ప్రైవేటు బ్యాంకులు ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను చెల్లిస్తుంటాయి. ప్రైవేట్ బ్యాంకులకు భిన్నంగా ప్రభుత్వ బ్యాంకులు కొన్ని ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను చెల్లించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో త్వరపడి మీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను లాక్ చేసుకోండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను చెల్లిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు:

 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి పంబాజ్ అండ్ సింధ్ బ్యాంక్ ఐదు వందల రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 9.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. నార్త్ ఇండియాలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ బాగా ప్రాచుర్యం పొంది ఉన్న విషయం తెలిసిందే.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

2-3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 9.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇదే అతి పెద్ద రెండవ బ్యాంక్ ఇంత మొత్తంలో వడ్డీని ఆఫర్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో అంతర్బాగమే ఈ స్టేట బ్యాంక్ ఆఫ్ మైసూర్. కర్ణాటక రాజధాని బెంగుళూరులో దీని ప్రధాన కార్యాలయం.

ఆంధ్రా బ్యాంక్

ఆంధ్రా బ్యాంక్

హైదారాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆయిన ఆంధ్రా బ్యాంక్ తన కస్టమర్స్‌కు 9 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫిక్స్‌డ్ డిఫాజిట్ ఒక సంవత్సర కాలం పాటుకి అందిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మాదిరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అంతర్బాగమే. 1-2 సంవత్సరాల కాలపరిమితికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 9 శాతం వడ్డీ రేటుని ఆఫర్ చేస్తుంది.

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు | Govt banks that offer highest interest rates on fixed deposits

Interest rates in the economy are expected to fall, as inflation cools off. Here are a few government owned nationalised banks that offer the highest interest rates on fixed deposits.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X