For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవి కావు: ఆర్‌బీఐ

By Nageswara Rao
|

Systems to prevent money laundering in India perfect, says RBI
మద్యం అక్రమ రవాణా, లేదా తీవ్రవాద కార్యకలాపాల వంటి తీవ్ర నేరాల నుండి పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బుని చట్టబద్దమైన మార్గంలోనే సంపాదించామంటూ చూపించే ప్రక్రయని మనీ లాండరింగ్ అంటారు.

దేశంలోని మూడు ప్రయివేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌లపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవి కావని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి తెలిపారు. మనీ లాండరింగ్‌ను అడ్డుకునే పటిష్టమైన వ్యవస్థ భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లలో మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ‘కోబ్రాపోస్ట్' అనే ఆన్‌లైన్ పోర్టల్ గత వారం ఆరోపిస్తూ సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంకర్ల సమావేశంలో పాల్గోన్న అనంతరం మాట్లాడుతూ ఆ బ్యాంకుల్లో జరిగింది కేవలం కేవైసీ (నో యువర్ కస్టమర్) ఉల్లంఘన వ్యవహారమే తప్ప ఎలాంటి కుంభకోణం జరగలేదని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో ఆర్థిక పరమైన ఎటువంటి లావాదేవీ జరగలేదని చెప్పారు. కోబ్రాపోస్ట్ ఆపరేషన్‌లో చోటుచేసుకున్న అంశాలన్నీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అంశాలే తప్ప, మనీ లాండరింగ్‌కు సంబంధించినవిగా భావించకూడదని పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధానికి అనుసరిస్తున్న విధానాలు చాలా సంపూర్ణమైనవి. ఆ విధానాలలో ఎటువంటి దోషాలు లేవని స్పష్టం చేశారు. అవసరమనిపిస్తే మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థను ఆర్‌బిఐ మరింత పటిష్టంగా, కఠినంగా తీర్చిదిద్దుతుంది.

ఐతే ఆ బ్యాంకులకు సంబంధించిన కొంత మంది అధికారులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, సంబంధిత బ్యాంకు యాజమాన్యాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇంటర్నల్ ఆడిటింగ్ కూడా చేస్తున్నాయని వెల్లడించారు. కాగా ఆరోపణలు వచ్చిన వెంటనే సంబంధిత బ్యాంకులు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశాయి. ఆర్‌బీఐ కూడా మూడు బ్యాంకులు నో యువర్ కస్టమర్ మార్గదర్శకాలను అతిక్రమించాయా అన్న కోణంలోనే విచారణ జరుపుతోంది. ఈ నెల చివరికి తుది నివేదికలు అందుతాయి. దాని ఆధారంగా అవసరమైతే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

అక్రమ ధనార్జనా నిరోధానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ మరింత పటిష్టం చేస్తుందని చెప్పారు. కొంతమంది పన్నులు చెల్లించడం లేదని, ఇటువంటి డబ్బు మన వ్యవస్థలోకి మనీ లాండరింగ్ రూపంలో చెలామణీలోకి వస్తోందని అన్నారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొనవచ్చన్న అంశంపై బ్యాంకులకు ఆర్‌బీఐ ఇప్పటికే తగిన మార్గదర్శకాలను ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారాలన్నింటిపై కేవలం సంబంధిత మూడు ప్రైవేటు బ్యాంకులనే కాకుండా, ఇతర అన్ని బ్యాంకులపై ఆర్‌బీఐ అధికారులు పరిశీలన జరుపుతున్నారని చక్రవర్తి తెలిపారు.

వన్ఇండియా తెలుగు మనీ

English summary

మనీ లాండరింగ్ ఆరోపణలు తీవ్రమైనవి కావు: ఆర్‌బీఐ | Systems to prevent money laundering in India perfect, says RBI | మనీ లాండరింగ్ అంటే ఏమిటీ..?


 The Reserve Bank of India today sought to downplay the money-laundering allegations against three private sector banks, saying the country has a "perfect" system to prevent such offences and that not a single such transaction took place in the sting operation.
Story first published: Friday, March 22, 2013, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X