For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణాలపై పావు శాతం తగ్గిన ఆంధ్రాబ్యాంక్ రుణ వడ్డీరేట్లు

By Nageswara Rao
|

Andhra Bank
హైదరాబాద్: ఆంధ్రా బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం 10.50 శాతంగా ఉన్న బేస్ రేటును 10.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ నిన్న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ తగ్గిన రేట్లు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. గతంలో బీఎంపీఎల్‌ఆర్ విధానంలో తీసుకున్న రుణాలపై కూడా వడ్డీరేట్లను 14.75 శాతం నుంచి 14.5 శాతానికి తగ్గిస్తూ ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇటీవల ఆంధ్రా బ్యాంక్ ప్రకటించిన మూడవ త్రైమాసిక ఆర్దిక ఫలితాల నికరలాభంలో రూ. 257.09 కోట్లను ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన నికర లాభంతో ఈఏడాది ఫలితాలను పోల్చి చూస్తే 15.2 శాతం నికర లాభం తగ్గింది. నాలుగో త్రైమాసికంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ బి.ఏ. ప్రభాకరరావు చెప్పారు.

రాష్ట్రంలోకి భారీ ప్రాజెక్టులు ఏవి రావడం లేదని పేర్కొన్నారు. దీంతో మధ్య, భారీ కార్పొరేట్‌ రుణాల్లో వృద్ధి తగ్గిందని తెలిపారు. ప్రాధాన్యత రంగాల రుణాల మంజూరులో మాత్రం 23.7 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. వ్యవసాయ రంగానికి అందించిన రుణాల్లో ఏకంగా 26.8 శాతం పెరుగుదల ఉందన్నారు. నిర్వహణ లాభం కూడా తగ్గిందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆంధ్రాబ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.3% నుంచి 11.86 శాతానికి తగ్గింది.

తెలుగు వన్ఇండియా

English summary

రుణాలపై పావు శాతం తగ్గిన ఆంధ్రాబ్యాంక్ రుణ వడ్డీరేట్లు | Andhra Bank cuts benchmark lending rates by 0.25% | పావు శాతం తగ్గిన ఆంధ్రాబ్యాంక్ రుణ వడ్డీరేట్లు

State-owned Andhra Bank reduced its benchmark lending rates by 0.25 per cent to 10.25 per cent, making home, auto and corporate loans cheaper for borrowers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X