Q2లో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 1123.54 కోట్లు

Axis Bank Q2 net up 22% to Rs 1,123 cr
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రూ. 1123.54 కోట్లకు చేరింది. గతయేడాది ఇదే ఆర్దిక సంవత్సరంలో బ్యాంకు లాభం రూ. 920.32 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతానికి పెరిగింది. ఆదాయలతో పోలిస్తే తక్కువగా పెరిగిన వ్యయాల కారణంగా లాభం పెరిగినట్లు యాక్సిస్ బ్యాంకు పేర్కోంది.

మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ. 6510.89 కోట్ల నుండి రూ. 8280.29 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం రూ. 2007 కోట్ల నుండి రూ. 2327 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం 29 శాతం వృద్దితో రూ.1593 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ చివరి నాటికి నికర వడ్డీ మార్జిన్ 3.37 నుండి 3.46 శాతానికి పెరిగిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంక్ నికరలాభం 22% వృద్ధిరేటు తో రూ.1862.67 కోట్ల నుంచి రూ.2277.06 కోట్లకు చేరుకుంది.

ఇక కనీస పెట్టుబడులు నిష్పత్తి (సీఏఆర్) 12.99 శాతంగానూ, నికర మొండి బకాయిలు (ఎన్‌పీఏ)లు 0.34 శాతంగానూ నమోదయ్యాయి.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+