For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు

By Nageswara Rao
|

FIIs pump over Rs 10,000 cr in stocks in two weeks
ఈనెల మొదటి రెండు వారాల్లో విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) దేశీయ ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఆర్దిక వృద్ది, ఇన్వెస్ట్‌మెంట్‌కు ఊతమిచ్చే భాగంలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడంతో మార్కెట్లో ఎఫ్‌ఐఐలు ఈక్విటీ పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. అక్టోబర్‌ 1-12 వరకు ఎఫ్‌ఐఐ దేశీయ మార్కెట్లో నికరంగా రూ.30,605 కోట్లు విలువ గల షేర్లు కొనుగోలు జరిపారు. ఇదే సమయంలో రూ. 20,223 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో స్టాక్ మార్కెట్లో నికరంగా విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్ల పెట్టుబడి రూ.10,382 కోట్లని మార్కెట్ నియంత్రణ సంస్ద సెబీ తెలిపింది.

కాగా, ఈక్విటీల్లో ఈ ఏడాది ఇంతవరకు విదేశీ మదుపరుల పెట్టుబడులు రూ. 92,713 కోట్ల (17.84 బిలియన్ డాలర్లు)కు చేరుకున్నాయి. మార్కెట్‌ నిపుణుల అంచనా ప్రకారం ఇటీవల ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు ప్రకటించినందువల్ల ఎఫ్‌ఐఐలు భారత్‌ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నారని స్టాక్‌ మార్కెట్లోకి ఎఫ్‌ఐఐ పెట్టుబడులు మరింత రావచ్చునని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందని విదేశీ సంస్దాగత ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.

ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్‌తో పాటు డెబిట్‌ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,273 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌ 12 నాటికి దేశంలో ఎఫ్‌ఐఐలు 1,752 మంది రిజిస్టర్‌ అయినట్లు సమాచారం.

తెలుగు వన్ఇండియా

English summary

రెండు వారాల్లో ఈక్విటీ మార్కెట్లలో రూ. 10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు | FIIs pump over Rs 10,000 cr in stocks in two weeks | రెండు వారాలు @ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు

Foreign institutional investors poured in over Rs 10,000 crore in the stock market this month so far enthused by reforms initiatives taken by the government to boost economic growth and investor sentiment.
Story first published: Monday, October 15, 2012, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X