
అక్టోబర్ 1-5 వరకు ఎఫ్‌ఐఐలు రూ.13,094 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. రూ.9,714 కోట్ల షేర్లు విక్రయించారు. దీంతో నికరంగా విదేశీ సంస్దాగత మదుపరులు మార్కెట్లో పెట్టుబడి పెట్టింది రూ.3,381 కోట్లుగా తెలింది. ఈ విషయాలను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తెలియజేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐలు ఈక్విటీ మార్కెట్లో మొత్తం రూ.85,711 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటును పెంచే భాగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం వల్ల విదేశీ పెట్టుబడులు మరింత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
గత నెల ప్రభుత్వం రీటైల్ రంగంలో ఎఫ్‌డీఐలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించింది. బీమా రంగంలో కూడా విదేశీ పెట్టుబడుల వాటాను పెంచింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలపడింది. పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందకు ముందకు వస్తున్నారు. ఈక్విటీ మార్కెట్‌తో పాటు ఎఫ్‌ఐఐలు రూ.1,382 కోట్లు బెడిట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో స్టాక్ మార్కెట్ 176 పాయింట్లు పెరిగింది. ఎన్నడూ లేని విధంగా గత గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమవ్వడమే కాకుండా 19వేలకు పైగా ట్రేడ్ అయింది. 15 నెలల గరిష్ట స్దాయికి సెన్సెక్స్ చేరింది. డీజిల్ ధర పెంచడం, రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐని అనుమతించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం ఏర్పడింది. కొన్ని నిర్ణయాలతో సంస్కరణలు నిలిపేస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం భావిస్తున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications