For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గత ఏడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా రూ. 19,000 కోట్ల పెట్టుబడులు

By Nageswara Rao
|

FIIs infuse over Rs 19,000 cr in Sep, highest in seven months
గత ఏడు నెలల్లో లేని విధంగా ఎఫ్‌ఐఐలు(విదేశీ ముదుపరులు) దేశీయ స్టాక్ మార్కెట్లో 3.5 బిలియన్ డాలర్లు (రూ. 19,000) కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంస్కరణలు ఈ జోరును మరింత పెంచాయి. ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో రూ.82, 331 కోట్లు (15.85 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. రూ.25,140 కోట్లు (5 బిలియన్ డాలర్లు) డెబిట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఇదే నెలలో ఎఫ్ఐఐలు గరిష్ఠంగా రూ.66,752 కోట్లు ఈక్వీటీ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయగా.. రూ.47,491 కోట్ల విలువగల షేర్లు విక్రయించారు.

ఫిబ్రవరి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పెట్టుబడులు రాలేదు. గత ఫిబ్రవరిలో రూ. 25,2012 కోట్లు పెట్టుబడులు పెట్టగా... ఆగస్టులో రూ.10,804 కోట్లు జులైలో రూ.10,273 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో కేంద్రప్రభుత్వం పలు కీలకసంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇది ఇలా ఉంటే దేశీయ మార్కెట్‌లోకి విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్‌ఐఐ) ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 11.2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సిఎంఐఈ) తన మానిటరీ రివ్యూలో అంచనా వేసింది.

జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, డాయిష్ బ్యాంక్ వంటి భారీ ఎఫ్‌ఐఐ సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇండియావైపు చూస్తున్నాయని పేర్కొంది. యూరోదేశాల రుణ సంక్షోభ పరిష్కారానికి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త ప్యాకేజీని ప్రకటించడం కూడా ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. పూర్తి ఏడాదికి దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి రావచ్చనని అంచనా వేసింది.

తెలుగు వన్ఇండియా

English summary

గత ఏడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా రూ. 19,000 కోట్ల పెట్టుబడులు | FIIs infuse over Rs 19,000 cr in Sep, highest in seven months | దేశీయ స్టాక్ మార్కెట్లో రూ. 19,000 కోట్ల పెట్టుబడులు

Overseas investors pumped in more than Rs 19,000 crore ($3.5 billion) in the Indian stock market in September, the highest monthly inflow in seven months, on account of bold economic reform initiatives taken by the government.
Story first published: Monday, October 1, 2012, 13:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X