For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐబీఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎం. బాసిన్

By Nageswara Rao
|

T.M. Bhasin named Deputy Chairman of IBA
చెన్నై: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) డిప్యూటీ ఛైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎం. బాసిన్ నియమితులయ్యారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అత్యున్నత సంఘం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ). అక్టోబర్ 1 నుండి 2013 సంవత్సరంలో జరిగే సంవత్సర సాధారణ సమావేశం వరకు భాసిన్ బాధ్యతలలను నిర్వహించనున్నాడు. టి. ఎం భాసిన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో 2000 నుండి మంచి సంభందాలను కొనసాగిస్తున్నారు. 2007 వరకు కూడా ఢిల్లీ చాప్టర్ సెక్రటరీగా కొనసాగారు.

ఇది ఇలా ఉంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అధిపతిగా యుకె.సిన్హా నియామకాన్ని రద్దుచేయాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఇదే న్యాయస్దానంయుకె.సిన్హాకు కూడా నోటీసు జారీచేసింది. సెబి చైర్మన్‌గా యుకె.సిన్హా నియామకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, అందువల్ల ఆయన నియామకాన్ని రద్దుచేయాలని కోరుతూ అరుణ్‌కుమార్ అగర్వాల్ వేసిన పిటిషన్ పరిశీలించిన జస్టిస్ నిజ్జార్, జస్టిస్ హెచ్‌ఎల్ గోఖలేతో కూడిన బెంచ్ ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి, సిన్హాకు నోటీసులు జారీచేసింది.

తెలుగు వన్ఇండియా

English summary

ఐబీఏ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఎం. బాసిన్ | T.M. Bhasin named Deputy Chairman of IBA | ఐబీఏ డిప్యూటీ ఛైర్మన్‌గా టి.ఎం. బాసిన్


 T.M. Bhasin, Chairman and Managing Director of Indian Bank, has been appointed as the Deputy Chairman of Indian Banks’ Association (IBA), effective October 2012. IBA is an apex advisory body of public sector, private sector and foreign banks in India.
Story first published: Friday, September 28, 2012, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X