For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా: బిల్ గేట్స్ టాప్, మన వాళ్లు ఐదుగురు

By Nageswara Rao
|

Bill Gates
న్యూయార్క్: అమెరికాలో అత్యంత ధనికుల జాబితాలో బిల్ గేట్స్ మళ్లీ అగ్రస్దానంలో నిలిచారు. ప్రమఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన అమెరికాలోని 400 బిలియనీర్ల జాబితాలో మైక్రోసాప్ట్ వ్యవస్దాపకుడైన బిల్ గేట్స్ వరుసగా 19వ సారి తొలి స్దానంలో నిలిచాడు. 2012 సంవత్సరానికి గాను బిల్ గేట్స్ సంపద 66 బిలియన్ డాలర్లు కాగా.. అంతక ముందు ఏడాదితో పోలిస్తే ఇది 7 బిలియన్ డాలర్లకు అధికం. ఇక 46 బిలియన్ డాలర్ల విలువతో బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ రెండో స్థానంలో ఉన్నారు. సంపన్న అమెరికన్ల నికర విలువ గత ఏడాది కాలంలో 13% పెరిగి 1.7 లక్షల కోట్ల డాల ర్లకు చేరింది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్ సంపద ఏకంగా 8.1 బిలియన్ డాలర్ల మేర కరిగి 9.4 బిలియన్ డాలర్లకు చేరడంతో 36వ స్థానానికి దిగారు.

గతయేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికన్ల సంపద 13 శాతానికి పెరిగి 1.7 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని పోర్బ్స్ మ్యాగజైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక యాపిల్ సహ వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో అత్యధిక ధనవంతురాలు. 11 బిలియన్ డాలర్లతో ఈమె జాబితాలో 28వ స్దానంలో ఉన్నారు. ఇక 2011లో 200 బిలియన్‌ డాలర్లుగా వారి సంపద ఉండేదని... దీనికి కారణం వారి కంపెనీల షేర్ల ధరలు పుంజుకోవడంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ ధరలు పంజుకో వడమే నని ప్రత్యేకంగా లాస్‌ఏంజిలెస్‌, న్యూయార్కుల్లో భారీగా పెరిగాయని అలాగే వారి వద్ద నుంచి కళాఖండాల సంపద కూడా పెరిగిందని ఫోర్బ్స్ వివరించింది.

ఫోర్బ్స్ ప్రచురించిన ధనవంతుల జాబితాలో అయిదుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో వినోద్ ఖోస్లా, భరత్ దేశాయ్, రమేష్ వాధ్వానీ, మనోజ్ భార్గవ, కవితార్క్ రామ్ శ్రీరామ్ ఉన్నారు. ఐటీ దిగ్గజం సింటెల్ వ్యవస్థాపకుడు భరత్ దేశాయ్ 2 బిలియన్ డాలర్ల సంపదతో 239వ స్థానంలో ఉన్నారు. సింఫనీ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ రమేష్ వాధ్వానీ 250వ ర్యాంకులో (1.9 బిలియన్ డాలర్లు), గూగుల్ బోర్డు సభ్యుడు కవితార్క్ రామ్ శ్రీరామ్ 298వ స్థానంలో (1.6 బిలియన్ డాలర్లు), ‘5 హవర్ ఎనర్జీ' డ్రింక్ సంస్థ సీఈవో మనోజ్ భార్గవ 311వ ర్యాంకులో (1.5 బిలియన్ డాలర్లు) నిల్చారు. వెంచర్ క్యాపిటలిస్ట్.. వినోద్ ఖోస్లా 1.4 బిలియన్ డాలర్లతో 328వ ర్యాంకులో ఉన్నారు.

తెలుగు వన్ఇండియా

English summary

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా: బిల్ గేట్స్ టాప్, మన వాళ్లు ఐదుగురు | Bill Gates retains top slot in Forbes's US richest list | ఫోర్బ్స్ ధనవంతుల జాబితా: 19వ సారి బిల్ గేట్స్

Microsoft co-founder Bill Gates has retained his position as the richest person in America for the 19th year in a row this year, according to Forbes' annual ranking of the nation's 400 super rich people who have a combined net worth of $ 1.7 trillion dollars.
Story first published: Friday, September 21, 2012, 11:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X