For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2,000 నోట్లు: ఏటీఎంలో మార్పులు నిజమే కానీ.. ఆందోళన వద్దు

|

ఏటీఎం కేంద్రాల్లో రూ.2,000 నోట్లు తగ్గుతున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎఫ్ఐఎస్ ఎండీ (బ్యాంకింగ్ సొల్యూషన్స్-ఏపీఎంఈఏ) మహే,్ రామమూర్తి స్పందించారు. ఏటీఎం కేంద్రాల్లో కరెన్సీ మార్పు విషయమై ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ చర్యల వల్ల కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం ఉండదని స్పష్టం చేశారు.

రూ.2,000 నోట్ల కథ ముగిసిందా? నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

2,40,000 ఏటీఎం కేంద్రాల్లో మార్పులు

2,40,000 ఏటీఎం కేంద్రాల్లో మార్పులు

త్వరలో భారత్‌లోని 2,40,000 ఏటీఎం కేంద్రాల్లో రీకాలిబ్రేషన్ (మార్పు) చేయాలని అనుకుంటున్నామని మహేష్ రామమూర్తి చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే స్లాట్స్‌ను రూ.500 నోట్లతో మారుస్తున్నామని తెలిపారు.

కస్టమర్లకు ఆందోళన అవసరంలేదు

కస్టమర్లకు ఆందోళన అవసరంలేదు

బ్యాంకులకు, ఏటీఎం నిర్వాహకులకు ఈ కార్యక్రమం భారీ కసరత్తు కానుందని తెలిపారు. కస్టమర్ల కౌసర్యార్థం వారు ఏటీఎంల నుండి ఎక్కువసార్లు విత్ డ్రా చేసుకోగలిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల వినియోగదారులు ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం ఈ చర్యలు చేపడతామన్నారు.

వారికీ ఆందోళన అవసరం లేదు

వారికీ ఆందోళన అవసరం లేదు

ఏటీఎం విత్ డ్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే బ్యాంకులు, బ్యాంకింగేంతర ఆర్థిక సంస్థలు (NBFC) కూడా దీని వల్ల ప్రయోజనం పొందుతాయని చెప్పారు. కస్టమర్లతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

English summary

రూ.2,000 నోట్లు: ఏటీఎంలో మార్పులు నిజమే కానీ.. ఆందోళన వద్దు | 2,40,000 ATMs to be recalibrated, but consumers need not worry

Amid reports that around 2.4 lakh ATMs across the country are likely to be recalibrated in the coming months, Mahesh Ramamoorthy, Managing Director (Banking Solutions-APMEA) at FIS, said consumers should not worry about it.
Story first published: Friday, February 28, 2020, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X