For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Price Hike: కొత్త సంవత్సరం కొత్త షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంచిన కంపెనీలు.. ఎంతంటే..

|

LPG Price Hike: ప్రతినెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేస్తుంటాయి. అయితే కొత్త సంవత్సరం రేట్లు తగ్గుతాయని ఆశించిన వారికి ఈ సారి కూడా నిరాశే మిగిలింది.

 పెరిగిన గ్యాస్ ధర..

పెరిగిన గ్యాస్ ధర..

దేశంలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచాయి. ఈ ఏడాది తొలి నెలలో ఒక్కో సిలిండర్ కు రూ.25 చొప్పున భారాన్ని పెంచాయి. దీనికి ముందు కంపెనీలు చాలా నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలను క్రమంగా తగ్గిస్తూ వచ్చాయి. అయితే ఇళ్లల్లో వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.

 పెంపు ప్రభావం ఇలా..

పెంపు ప్రభావం ఇలా..

జనవరి 1, 2023 నుంచి దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరలను రూ.25 పెంచటం వ్యాపారులపై కొత్త భారాన్ని పెంచుతుంది. ఈ చర్య రెస్టారెంట్లు, హోటళ్లు మొదలైన వాటిలో ఆహారపు ఖర్చులను పెంచుతుంది. ఈ క్రమంలో 19 కిలోల సిలిండర్ ధరలు దిల్లీలో రూ.1,768, ముంబైలో రూ.1,721, కోల్ కతాలో రూ.1,870, చెన్నైలో రూ.1,917గా ఉన్నాయి.

 గతంలో తగ్గింపులు..

గతంలో తగ్గింపులు..

2022 జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. ఆగస్టులో రూ.36, సెప్టెంబర్ మాసంలో రూ.100, అక్టోబర్ నెలలో రూ.25.50 తగ్గింపు వచ్చింది. నవంబర్ నెలలో కంపెనీలు రూ.115.50 తగ్గింపు ప్రకటించటంతో.. మెుత్తంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు 2022లో వాణిజ్య సిలిండర్ ధర రూ.619 మేర తగ్గింది. కానీ.. కొత్త సంవత్సరం బాదుడు మళ్లీ షురూ అయింది.

బాధలో గృహ వినియోగదారులు..

బాధలో గృహ వినియోగదారులు..

డొమెస్టిక్ సిలిండర్ల ధరల విషయంలో చాలా నెలలుగా ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతూ గ్యాస్ ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై చమురు కంపెనీలు ఈ సారి కూడా నీళ్లు చల్లాయి. దీంతో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,053, కోల్‌కతాలో రూ.1,079, చెన్నైలో 1,068.50, ముంబైలో రూ.1,052 స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం గతంలో అందించే సబ్సిడీని ఎత్తివేయటం తమకు భారంగా మారిందని చాలా మంది గ్యాస్ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.

 2022లో జరిగింది ఇదే..

2022లో జరిగింది ఇదే..

2022లో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రేటును చమురు కంపెనీలు కేవలం 5 సార్లు మాత్రమే మార్చాయి. అయితే ఈ ఐదు సార్లు ధరలను కంపెనీలు పెంచేందుకు మాత్రమే వినియోగించాయి. కానీ వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పోయిన ఏడాది 11 సార్లు తగ్గించాయి. కోటి ఆశలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన ప్రజలకు మెుదటి రోజే భారీ ధరల షాక్ తగిలిందని చెప్పుకోవాలి.

English summary

LPG Price Hike: కొత్త సంవత్సరం కొత్త షాక్.. గ్యాస్ సిలిండర్ ధర పెంచిన కంపెనీలు.. ఎంతంటే.. | 19kg commercial cyliner rates hiked by 25 rupees in 2022 january, domestic rates remain same

19kg commercial cyliner rates hiked by 25 rupees in 2022 january, domestic rates remain same
Story first published: Sunday, January 1, 2023, 9:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X