For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాపారులకు పేటీఎం అదిరిపోయే న్యూస్, ఆ ఛార్జీలు రద్దు

|

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం మంగళవారం వ్యాపారులకు శుభవార్త చెప్పింది. వ్యాపారులు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నింటి పైన ఛార్జీలను రద్దు చేసింది. పేటీఎం వ్యాలెట్, యూపీఐ యాప్స్, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్ పైన ఎలాంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి, వారి బిజినెస్ వృద్ధికి తోడ్పడుతుందని తెలిపింది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)లకు తోడ్పడేందుకు బ్యాంకులు, ఇతర ఛార్జీలు ఏటా రూ.600 కోట్ల ఎండీఆర్ ఛార్జీలను రద్దు చేసింది.

నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్

1.7 కోట్ల మంది వ్యాపారులకు ప్రయోజనం

1.7 కోట్ల మంది వ్యాపారులకు ప్రయోజనం

పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీవోఎస్ ఉపయోగిస్తున్న దాదాపు 1.7 కోట్ల మంది వ్యాపారులకు తాజా నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఎండీఆర్ ఛార్జీల రద్దు ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇందుకు రూ.600 కోట్లు అవుతాయని, ఈ ఎండీఆర్ ఛార్జీల భారాన్ని పేటీఎం భరిస్తుందని తెలిపింది.

రూ.1000 కోట్ల రుణం

రూ.1000 కోట్ల రుణం

ఎండీఆర్ చార్జీల రద్దు నిర్ణయం డిజిటల్ ఇండియా మిషన్‌కు దోహదపడుతుందని పేటీఎం తెలిపింది. ఎంఎస్ఎంఈలకు మార్చి 2021లోపు రూ.1000 కోట్ల రుణాలు అందించి అండగా ఉండాలని పేటీఎం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

పేమెంట్స్ ఆప్షన్ వారి ఇష్టం

పేమెంట్స్ ఆప్షన్ వారి ఇష్టం

అలాగే, పేమెంట్స్‌ను నేరుగా తమ పేటీఎం వ్యాలెట్‌కు లేదా తమ బ్యాంకు ఖాతాకు బదలీ చేసుకునే వెసులుబాటును కూడా వ్యాపారులకు కల్పిస్తున్నట్లు తెలిపింది పేటీఎం. పేటీఎం వ్యాలెట్, యూపీఐ, రూపే, నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపుల వెసులుబాటు ఉంది. పేటీఎం ఆల్ ఇన్ వన్ క్యూఆర్ జీరో ఛార్జీతో అపరిమిత చెల్లింపులను అంగీకరించేందుకు వ్యాపారులకు అవకాశం ఇస్తోంది.

English summary

వ్యాపారులకు పేటీఎం అదిరిపోయే న్యూస్, ఆ ఛార్జీలు రద్దు | Paytm waives charges on merchant transactions: to absorb MDR of Rs 600 crore

Fintech major Paytm on Tuesday said it will waive all charges on merchant transactions, and enable its merchant partners to accept payments from Paytm wallet, UPI apps and RuPay cards at zero charges.
Story first published: Tuesday, December 1, 2020, 19:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X