కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో రూ.3 లక్షల కోట్లు హామీలేని రుణాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారాలు, స్టార్టప్స్... మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEs)లు రిజిస్టర్ చేసుకుంటున్నాయి. అయితే ఈ అన్ని సంస్థలకు ప్రభుత్వ రిలీఫ్ ప్యాకేజీ ప్రయోజనం అందకపోవచ్చునని చెబుతున్నారు.

రుణాలు, ఇతర ప్రయోజనాలు
గత ఏడాది కాలంగా లిక్విడిటీ సమస్యతో ఇబ్బందులుపడుతున్న 4.5 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రుణాలు అక్టోబర్ 31వ తేదీ వరకు ఇస్తారు. రూ.25 కోట్ల వరకు రుణాలు కలిగిన వ్యాపారలకు ఇది వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా స్టార్టప్స్, చిన్న వ్యాపారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ ఉద్యోగ్ ఆధార్ ద్వారా రుణాలు, ఇతర ప్రయోజనాలను పొందడానికి చాలా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ చూస్తున్నాయి.

బకాయిలు ఉన్న సంస్థలకు అర్హత
స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు భారీగా ప్రయోజనాలు పొందాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ రుణ దృశ్యం అస్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అన్ని సంస్థలు రూణాలు పొందే పరిస్థితి లేదంటున్నారు. ఈ కొత్త రుణాలు అదనపు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్‌గా పేర్కొంటున్నారు. ఈ రుణాలకు కంపెనీల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే వీటికి వంద శాతం ప్రభుత్వ గ్యారెంటీ ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వ ఎంఎస్ఎం ఈ వెబ్ సైట్ నుండి నమోదు చేయబడిందా లేదా అనే దాంతో సంబంధం లేదు. బకాయిలు ఉన్న సంస్థలకు అర్హత ఉంటుంది.

ప్రభుత్వ హామీ
ఇటీవల 2,00,000 ఎంఎస్ఎంఈలకు రూ.20,000 కోట్ల రుణాలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ సంస్థలు ఒత్తిడిలో ఉన్నవి లేదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌గా ఉన్నాయి. ప్రభుత్వం మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌కు రూ.4,000 కోట్లు పంపిణీ చేస్తుంది. మూడో పార్టీ గ్యారంటీ అవసరం లేకుండా బ్యాంకు లోన్ పొందుతాయి. అయితే ప్రభుత్వం రూ.20,000 కోట్లకు హామీ ఇస్తుంది.

వడ్డీ రేటు స్వల్పంగా...
ఎంఎస్ఎంఈ ప్రమోటర్లకు బ్యాంకులు యూనిట్ వాటాలో 15 శాతం సబార్డినేట్ రుణాలు అందిస్తాయని, ఈ రుణ మొత్తం రూ.75 లక్షల వరకు ఉంటుందని, వడ్డీ రేటు స్వల్పంగా ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇవి కూడా కేవలం రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలకేనని, ఇప్పటికే ఆర్థిక ఒత్తిడికి లోనై, డిఫాల్ట్ ప్రమాదం ఉన్న వాటికి వర్తిస్తుందని చెబుతున్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications