For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంఎస్ఎమ్ఈలకు డిజిటల్ బ్యాంకింగ్ యాప్: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కొత్త యాప్ ఇన్స్‌టాబిజ్,

|

మధ్య, చిన్న పరిశ్రమలు, స్వయంఉపాధి కస్టమర్లుకు తమ లావాదేవీలు డిజిటల్ పద్దతిలో జరిపేందుకు ఇన్స్‌టా బిజ్ అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాంను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా తమ కస్టమర్లు ఐసీఐసీఐకి సంబంధించి అత్యంత భద్రతతో కూడిన 115 ప్రాడక్ట్స్‌ను సేవలను వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. ఇది మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది.

ప్రస్తుతం అందించే సేవలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే తొలిసారిగా పేర్కొంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్స్‌టా బిజ్‌ ద్వారా ఎంఎస్ఎమ్ఈలు మెరుగైన సౌలభ్యం మరియు ఉత్పాదకతను ఆస్వాదించే అవకాశం ఉంది. ఇక ప్రతి చిన్న విషయానికి బ్యాంకుకు వచ్చే పనిలేకుండా అన్నీ ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంపైనే జరిగిపోతాయని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. డిజిటల్ పద్ధతిలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం రూ.15 లక్షల వరకు బిజినెస్ లోన్లు , పెద్దమొత్తంలో కలెక్షన్లు, వివిధ డిజిటల్ రూపంలో చెల్లింపులు, ఎగుమతులు దిగుమతులులాంటివి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ICICI Bank launches ‘InstaBIZ’, India’s first most comprehensive digital banking platform for MSMEs

అంతేకాదు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంపై జీఎస్టీ పేమెంటు తక్షణమే చేసేలా వీలుకల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. చలాన్ నెంబరు ఉంటే చాలు పేమెంటు ఒక్క క్లిక్‌తో చేయొచ్చని పేర్కొంది. పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ కావాలంటే కూడా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని ఇన్స్‌టా బిజ్ ద్వారానే ఇది జరిగిపోతుందని చెప్పింది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లు కానీ MSMEకస్టమర్లు కూడా ఇన్స్‌టా బిజ్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. బ్యాంక్ స్టేట్‌మెంట్, కేవైసీ వివరాలు అప్‌లోడ్ చేయడం ద్వారా రూ.10 లక్షల వరకు తక్షణ రుణాలు పొందొచ్చని స్పష్టం చేసింది.కరెంట్ ఖాతా కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అకౌంట్ నెంబరును కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఒకే ప్లాట్‌ఫాంపై MSMEలకు, స్వయం ఉపాధి వినియోగదారులకు అధిక మొత్తంలో డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక యాప్ ఇన్స్‌టాబిజ్‌ అని ఐసీఐసీఐ తెలిపింది.

MSME స్వయం ఉపాధి వర్గాల వారు దేశ ఆర్థికవ్యవస్థకు వెన్నెముక వంటి వారని ఐసీఐసీఐ స్వయం ఉపాధి వర్గం విభాగపు అధినేత పంకజ్ గాడ్గిల్ చెప్పారు. మధ్య, చిన్న,సూక్ష్మ రంగం అభివృద్ధి చెందుతుందంటే ఇందుకు కారణం సరళీకృతపరమైన లావాదేవీలు, డిజిటైజేషన్‌లే కారణమని అన్నారు.దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇన్స్‌టా బిజ్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

ఇన్స్‌టాబిజ్ సేవలు:

* బ్యాంక్ అకౌంట్ పర్యవేక్షణ

* సేల్స్, క్యాష్ వివరాలు, చెల్లించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు, 24*7 లావాదేవీల సేవలను ఈ యాప్ ద్వారా MSMEలకు కల్పిస్తోంది

MSMEల అవసరాలకు అనుగుణంగా పరిమితులతో కూడిన ఆర్థిక లావాదేవీలను ఇన్స్‌టాబిజ్ కల్పిస్తుంది. నిర్దిష్ట లావాదేవీలను నిర్వహించేందుకు భద్రతతో కూడిన లావాదేవీలు జరిపేందుకు ఇన్స్‌టాబిజ్ ఉపయోగపడుతుంది. ఇన్స్‌టాబిజ్ ద్వారా వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకునే వీలుంటుంది. ముఖ్యంగా చిన్న మధ్యతరహా వ్యాపారస్తులకు ఇన్స్‌టా బిజ్ బాగా ఉపయోగపడుతుందని గాడ్గిల్ చెప్పారు. ఇక వారి వ్యాపారాలకు సంబంధించి ఇన్స్‌టాబిజ్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ కస్టమర్లకు నోటిఫికేషన్స్ పంపుతూ ప్రమోట్ చేసుకునే సదుపాయం ఇందులో ఉందని చెప్పారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లోనే ఇన్స్‌టాబిజ్ అందుబాటులో ఉందని త్వరలో యాపిల్ స్టోర్‌లో కూడా లభ్యమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఐసీఐసీఐ బ్యాంకింగ్‌కు లాగిన్ అయి అందులోని కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ పేజీకి వెళితే అందులో ఇన్స్‌స్టాబిజ్ పొందొచ్చని తెలిపారు.

English summary

ఎంఎస్ఎమ్ఈలకు డిజిటల్ బ్యాంకింగ్ యాప్: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కొత్త యాప్ ఇన్స్‌టాబిజ్, | ICICI Bank launches ‘InstaBIZ’, India’s first most comprehensive digital banking platform for MSMEs

ICICI Bank announces the launch of a new digital platform curated specially for MSMEs and self-employed customers to enable them to undertake their business banking transactions digitally and instantly. Called, 'InstaBIZ', it allows customers to avail as many as over 115 products and services in a digital and secure manner on their mobile phone or internet banking platform.
Story first published: Thursday, July 18, 2019, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X