For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కారు కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలుసుకుంటే మీకెంతో లాభం

|

ఈ రోజుల్లో కారు నిత్యావసరంగా మారిపోయింది. ఓలా, ఉబెర్ లాంటి కంపెనీలు వచ్చినప్పటికి సొంత కారు కొనుగోలుచేయాలని భావిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. చాలా మంది కొనుగోలు చేస్తున్నారు కూడా. కారు కొనాలనుకునే వారు ముందు తమ బడ్జెట్ ఏ స్థాయిలో ఉందో చూసుకుంటారు. ఆ తర్వాత మిగతా మొత్తానికి రుణం తీసుకుంటారు. రుణం ద్వారా కారును కొనుగోలు చేస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. ఈ రుణాలను బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు అందిస్తున్నాయి. అయితే రుణం తీసుకునే ముందు మాత్రం కొన్ని విషయాలు తప్పని సరిగా తెలుసుకోవాలి. అప్పుడే రుణ భారం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవేమిటంటే..

షోరూములో రుణ సదుపాయం...

షోరూములో రుణ సదుపాయం...

* మీరు కారు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు సమీపంలోని షో రూము కు వెళతారు. ఆ మోడల్ లో ఉన్న వేరియంట్ ను ఎంచుకుంటారు. దాని ధర ఎంత ఉందో తెలుసుకున్న తర్వాత మీరు చెల్లించే మొత్తం పోగా మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటామని చెప్పిన తర్వాత మీకు రుణ సదుపాయం ఎవరి ద్వారా లభిస్తుందో డీలర్లు చెబుతారు. అప్పటికే ఆ డీలర్లు కొన్ని ఆర్ధిక సంస్థలతో రుణం ఇప్పించడానికి ఒప్పందం చేసుకొని ఉంటారు. కాబట్టి వారి ద్వారా రుణాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు తీసుకునే రుణం పై వారికి 1-2 శాతం కమీషన్ లభించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తమతో టై అప్ కుదుర్చుకున్న బ్యాంకు లేదా ఎన్ బీ ఎఫ్ సి ద్వారా రుణం ఇప్పించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త ఆలోచించుకోవాలి.

వడ్డీ రేట్ల గురించి వాకబు చేయండి...

వడ్డీ రేట్ల గురించి వాకబు చేయండి...

మీరు రుణంతో కారు కొనుగోలు చేయాలనుకుంటే ముందు వివిధ బ్యాంకులు ఇస్తున్న కారు రుణాల గురించి తెలుసుకోండి. మీ బ్యాంకు, ఇతర బ్యాంకులు, ఎంబీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవడం ముఖ్యమే. వీటిలో తక్కువ వడ్డీరేటు ను ఇచ్చే సంస్థను ఎంచుకోవడం వల్ల మీపై భారం తగ్గుతుంది.

ప్రీ అప్రూవ్డ్ రుణం ...

ప్రీ అప్రూవ్డ్ రుణం ...

మీరు కొన్నేళ్లుగా మీ బ్యాంకులో నిర్వహిస్తున్న లావాదేవీల చరిత్ర బాగుంటే మీకు ప్రీ అప్రూవ్డ్ రుణం అందించే అవకాశం ఉంటుంది. దీనిపై వడ్డీ రేటు కూడా తక్కువ ఉండవచ్చు. కాబట్టి దీన్ని ఒకసారి చూసుకోండి. బ్యాంకుతో ఉన్న సంబంధాన్ని బట్టి కాస్త తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

మోడల్ ను బట్టి

మోడల్ ను బట్టి

* అన్ని మోడల్ కార్లకు వడ్డీ రేటు ఒకే విధంగా ఉండదు. మోడల్ ను బట్టి వడ్డీరేటు మారడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల మీ బడ్జెట్ లో మార్పులు చైతు చేసుకోవచ్చు. కాబట్టి ఈ వివరాలు ముందే తెలుసుకోవాలి.

* కొన్ని సందర్భాల్లో బ్యాంకులు తమ రుణ వితరణ లక్ష్యాలను చేరుకోవడానికి రుణ మేళాలను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజు

ప్రాసెసింగ్ ఫీజు

* వివిధ బ్యాంకులు కారు రుణాలను 8.05 శాతం నుంచి 12.1 శాతం వరకు ఇస్తున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫిజును వాసులుచేయవు.

బ్యాంకును బట్టి రుణ కాల పరిమితి, తీసుకునే రుణం తదితర అంశాలపై ప్రాసెసింగ్ ఫీజు ఆధారపడి ఉంటుంది.

English summary

కారు కొనాలనుకుంటున్నారా? ఈ వివరాలు తెలుసుకుంటే మీకెంతో లాభం | Want to buy new car with loan? here are few points useful to you

While buying a new car many people prefer to take car loan. Before taking car loan interest is important. so that before taking loan must search for good interest giving financial institution.
Story first published: Friday, November 29, 2019, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X