For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ టెక్నాలజీలను నేర్చుకుంటే... మీ పంట పండినట్టే..

|

ఉద్యోగాలు తక్కువ... పోటీ పడేవారు ఎక్కువ. ఇంతటి కాంపిటీషన్ యుగంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఇంకో ఎత్తు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు గాల్లో దీపాల్లా మారిపోయాయి. ఎప్పుడు పింక్ స్లిప్ చేతిలో పెడతారో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించాయి. మరి కొన్ని కంపెనీలు కూడా అదేబాటలో సాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలోని మధ్య స్థాయిలో ఎక్కువగా ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని పరిశ్రమ దిగ్గజాలే చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలు ఐటీ రంగంలో ఉద్యోగం సంపాదించాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటీ? ఎలాంటి టెక్నాలజీ స్కిల్స్ కు డిమాండ్ ఉంది. వాటిని నేర్చుకుంటే ఎంత ప్యాకేజీ పొందవచ్చన్న వివరాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

నైపుణ్యాలు పెంచుకోవాలి...

నైపుణ్యాలు పెంచుకోవాలి...

ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొంత కాలానికి బోర్ కొట్టవచ్చు. రోజు ఒకే రకమైన పని చేయడం ఇబ్బందిగా మారవచ్చు. వేతనం ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల విసుగురావచ్చు. మరో ఉద్యోగంలోకి మారితే ఎక్కువ వేతనం పొందే అవకాశం ఉండవచ్చు. జీవితంలో ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవాలంటే ఉన్నతమైన ఉద్యోగం చేయాలి. ఎక్కువ వేతనాన్ని ఆర్జించాలి. అప్పుడే కోరికలు నెరవేరుతాయి. అయితే కలలను సాకారం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రమించాల్సిందే. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాల్సిందే మరి. ఐటీ కంపెనీలు వేలాదిగా ఉన్నాయి. తగిన నైపుణ్యాలను కలిగి ఉంటే ఉద్యోగాలకు కొదువేలేదు. యాప్ ల మాదిరిగా ఎప్పటికప్పుడు అప్డేట్ కాకుంటే మాత్రం ఉన్న ఉద్యోగానికి ఎసరు రావడానికి అవకాశం ఉంది.

ఈ టెక్నాలజీలదే హవా...

ఈ టెక్నాలజీలదే హవా...

* టెక్నాలజీల్లో శరవేగ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఉత్పత్తులు వీటి ఆధారంగా వస్తున్నాయి. మనుషుల పనులను సులభతరం చేయడానికి ఈ టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. ఇలాంటి నవతరం టెక్నాలజీలను నేర్చుకున్న వారికి మంచి వేతనాలు లభిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటిలో నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి.

అవేమిటంటే..

* కృత్రిమ మేధ ( ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ - ఏఐ)

* మెషిన్ లెర్నింగ్

* బ్లాక్ చెయిన్

* సైబర్ సెక్యూరిటీ

* బిగ్ డేటా అనలిటిక్స్

* రోబోటిక్స్

ఈ టెక్నాలజీలే వచ్చే ఏడాదిలో అగ్రస్థాయి ఐటీ నైపుణ్యాలుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీల్లో నైపుణ్యాలు కలిగిన వారి అవసరం సమీప భవిష్యత్తులోనే 52,000 వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విభాగాల్లో నైపుణ్యాలు కలిగిన వారికి భారీ స్థాయిలో వేతన ప్యాకేజీలు ఉంటాయని చెబుతున్నారు.

ఏఐ - ఎంఎల్

ఏఐ - ఎంఎల్

వచ్చే ఏడాదిలో ఈ రెండు టెక్నాలజీలో స్కిల్స్ కలిగిన వారికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. కంపెనీలు తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి వీటిని భారీ స్థాయిలో అమలు చేస్తున్నాయి. అందుకే ఏఐ సంబంధిత ఉద్యోగాలు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు.

ఇటీవల సర్వే ప్రకారం.. మెషిన్ లెర్నింగ్, ఏఐ లో 14 లక్షల ఉద్యోగ అవకాశాలున్నట్టు వెల్లడైంది.

బ్లాక్ చెయిన్

బ్లాక్ చెయిన్

ఐటీ ఉద్యోగ మార్కెట్లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి ప్రాధాన్యం బాగా పెరిగిపోతోంది. ఇందులో నైపుణ్యాలు ఉన్న వారికి కంపెనీలు మంచి ప్యాకేజీని ఇస్తున్నాయి. రవాణా, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, మాన్యుఫాక్చరింగ్, డిజిటల్ ప్రెమెంట్స్, గేమింగ్ వంటి పరిశ్రమలు బ్లాక్ చెయిన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

బిగ్ డేటా అనలిటిక్స్

బిగ్ డేటా అనలిటిక్స్

డేటా భారీ స్థాయిలో పెరిగిపోతోంది. దీన్ని సక్రమంగా నిర్వహించడానికి గాను డేటా సైంటిస్ట్ ల అవసరం ఏర్పడుతోంది. వచ్చే ఏడాదిలో ఈ విభాగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

సైబర్ సెక్యూరిటీ

సైబర్ సెక్యూరిటీ

సైబర్ దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దాడులు తరచుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ వృత్తినిపుణులకు డిమాండ్ భారీగా ఏర్పడుతోంది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో ఈ నైపుణ్యాలు కలిగిన వారికీ మంచి వేతనాలు అందుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ తో పాటు సైబర్ సెక్యూరిటీ వృత్తినిపుణులకు మంచి గిరాకి ఉంది.

అందుకే కొత్త టెక్నాలజీలపై పట్టు సాధిస్తే.. దిగ్గజ కంపెనీల్లో భారీ వేతన ప్యాకేజీని పొందే అవకాశం ఉంటుంది. బీ రెడీ...

English summary

ఈ టెక్నాలజీలను నేర్చుకుంటే... మీ పంట పండినట్టే.. | Want good IT job? Learn New technology skills those have more demand

AI, machine learning, blockchain and cyber security will see huge demand in the coming years. Who has these skill will get good annual package. Companies are ready to recruit these technology skilled people with attractive packages.
Story first published: Saturday, November 9, 2019, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X