For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌కం ట్యాక్స్ రూల్స్‌లో మార్పు, PF ఎర్నింగ్స్‌పై ఎలా మారాయంటే?

|

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(EPF) వంటి నిధులకు పన్నులకు సంబంధించి ఓ విధానం ఉంది. ఈపీఎఫ్ మీకు రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడే మొత్తం. సాధారణంగా ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్, దీని నుండి వచ్చే ఆదాయంపై EEE(మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు)ను కలిగి ఉంటుంది. అయితే కొన్ని షరతులకు లోబడి ఈ మినహాయింపు ఉంటుంది. ఏదేమైనా ఫైనాన్స్ యాక్ట్, 2020 మరియు ఫైనాన్స్ యాక్ట్ 2021లో ఇటీవల చేసిన సవరణలు కొన్ని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకు వచ్చాయి.

మార్పులు

మార్పులు

ఫైనాన్స్ యాక్ట్, 2020, ప్రకారం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఈపీఎప్, సూపరాన్యుయేషన్ ఫండ్(SAF), నేషనల్ పెన్షన్ స్కీం(NPS)కు సంబంధించి రూ.7.5 లక్షలకు మించితే పన్ను చెల్లింపు నిబంధనలోకి తీసుకు వచ్చింది. ఇది మాత్రమే కాకుండా యజమాని అదనపు సహకారంతో వడ్డీ, డివిడెండ్ వంటి వాటి ద్వారా ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యే మొత్తంపై ఉద్యోగుల చేతిలో పన్నుగా విధించబడుతుంది. అలాగే, ఫైనాన్స్ యాక్ట్, 2021 ప్రకారం ఈపీఎఫ్‌కు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ పైన వచ్చే వడ్డీ పైన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంది. అయితే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటే రూ.2.5 లక్షలు దాటితే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లేకుంటే రూ.5 లక్షలు దాటితే ఇది వర్తిస్తుంది. ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంగా ఈ మొత్తంపై పన్ను విధిస్తారు. ఈ సవరణ చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం అధిక వేతనాలు, తక్కువ వేతనాలు ఉన్నవారి మధ్య అసమానతలను తగ్గించడం.

నోటిఫికేషన్ జారీ

నోటిఫికేషన్ జారీ

ఉద్యోగుల అదనపు కాంట్రిబ్యూషన్ పైన పన్ను విధించదగిన వడ్డీని లెక్కించడంలో సహాయపడేందుకు సీబీడీటీ ఆగస్ట్ 31, 2021న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం, 1962లో కొత్త రూల్ 9డీని ఇన్‌సర్ట్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి పీఎఫ్ ఖాతాలో పన్ను విధించదగిన కాంట్రిబ్యూషన్, పన్నురహిత కాంట్రిబ్యూషన్ కోసం ప్రత్యేక ఖాతాల నిర్వహణను ఈ నియమం నిర్దేశిస్తుంది. పన్ను చెల్లించదగిన సహకార ఖాతా పైన వచ్చే వడ్డీ మినహాయింపుకు అర్హత పొందదు.

పీఎఫ్ ఖాతాలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి పన్ను విధించదగిన, పన్ను విధించబడని ఖాతాలు క్రింది విధంగా నిర్వచించబడ్డాయి.

- నాన్-ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ అకౌంట్... మార్చి 31, 2021 నాటికి అకౌంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, తదుపరి సంవత్సరాలలో ఏదైనా కాంట్రిబ్యూషన్. దీనిని పన్ను పరిధిలోకి వచ్చే ఖాతాలో కలపలేదు.

- ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ అకౌంట్... 2021-22 ఆర్థిక సంవత్సరంలో, తర్వాత సంవత్సరంలో కాంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే.

పీఎప్ కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చిన వడ్డీ.

పన్ను పరిధిలోక ఇలా..

పన్ను పరిధిలోక ఇలా..

ఉదాహరణకు ఓ ఉద్యోగి సహకారం రూ.2.50 లక్షల కంటే తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటే పన్ను పరిధిలోకి రాదు. అదే సమయంలో రూ.3 లక్షల మొత్తం దాటితే... అంటే రూ.2.5 లక్షలు మించినందున పన్ను పరిధిలోకి వస్తుంది. రూ.50,000పై వచ్చే వడ్డీ (రూ.3,00,000-రూ.2,50,000) మీద, చేతిలోని మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి మరిన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.

English summary

ఇన్‌కం ట్యాక్స్ రూల్స్‌లో మార్పు, PF ఎర్నింగ్స్‌పై ఎలా మారాయంటే? | Taxes have changed on your PF earnings, Know the details

There has been a paradigm shift in the taxation of your contributions to funds such as the Employee Provident Fund (EPF) that help you save for retirement.
Story first published: Wednesday, September 29, 2021, 22:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X