For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాహనం దొంగిలించినా, బీమాను క్లెయిమ్ చేయవచ్చు? ఇలా చేయండి

|

దేశంలోని ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ తప్పనిసరి. అయితే ఇది మాత్రమే సరిపోదని, సమగ్ర బీమా ఉండటం మంచిదని నిపుణులు చెబుతుంటారు. థర్డ్ పార్టీ బమాలో కేవలం ఎదుటి వ్యక్తులు, వాహనాలు, ఆస్తుల వల్ల సంభవించిన ప్రమాదాలకు మాత్రమే బీమా రక్షణ ఉంటుంది. కానీ దొంగతనం లేదా మీ స్వయం తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలకు ఎలాంటి బీమా కవరేజీ ఉండదు. పేలుళ్లు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ వల్ల జరిగే నష్టంతో పాటు వాహనం చోరీకి గురైన సమగ్ర బీమా కవర్ ఉంటుంది.

మొదట ఇలా చేయండి

మొదట ఇలా చేయండి

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాహనాల దొంగతనం వింటూనే ఉన్నాం. మీ వాహనం దొంగిలించబడితే, మీ వాహనానికి బీమా ఉంటే క్లెయిమ్ చేయవచ్చు. దీంతో కొంత నష్టపరిహారం సమకూరుతుంది. క్లెయిమ్ ప్రాసెస్‌లో భాగంగా మొదట వాహనం దొంగిలించబడినట్లు మీరు గుర్తించిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాఫ్తు కోసం వాహనం తయారు చేసిన సంస్థ పేరు, మోడల్, లైసెన్స్ ప్లేట్ నెంబర్ మొదలైన అవసరమైన పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందించాలి.

బీమా సంస్థకు సమాచారం

బీమా సంస్థకు సమాచారం

ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక ఈ విషయాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. ఎఫ్ఐఆర్ కాపీని బీమా సంస్థకు ఇవ్వాలి. బీమా క్లెయిమ్ చేయడానికి ఎఫ్ఐఆర్ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. ఆ తర్వాత ఆర్టీవోకు సమాచారం ఇవ్వాలి. డాక్యుమెంటేషన్ వర్క్ ప్రారంభించాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం వాహన యజమాని వీలైనంత త్వరగా ప్రాంతీయ రవాణా కార్యాలయంలో వెహికిల్ దొంగతనం గురించి తెలియజేయాలి. క్లెయిమ్ ప్రాసెస్ కోసం బీమా సంస్థకు సమర్పించాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, బదలీ పేపర్లను ఆర్టీవో కార్యాలయం నుండి పొందాలి.

డాక్యుమెంట్స్ అవసరం

డాక్యుమెంట్స్ అవసరం

క్లెయిమ్ చేయడానికి బీమా సంస్థకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. బీమా పాలసీ కాపీ, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ కాపీ, క్లెయిమ్ ఫామ్, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, ఆర్సీ బుక్ కాపీ, ఆర్టీవో బదలీ డాక్యుమెంట్స్, సంబంధిత ఆర్టీవో ఫామ్స్ అవసరం. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులు ఇచ్చిన నో ట్రేస్ రిపోర్టును బీమా సంస్థకు ఇవ్వాలి. క్లెయిమ్ ఆమోదానికి రెండు నెలల నుండి మూడు నెలలు పట్టవచ్చు. వాహనంకు సంబంధించి అన్ని సెట్ల 'కీ'లను ఇవ్వాలి. ఇందులో విఫలమైతే క్లెయిమ్ తిరస్కరించవచ్చు.

English summary

వాహనం దొంగిలించినా, బీమాను క్లెయిమ్ చేయవచ్చు? ఇలా చేయండి | Steps to file A claim for vehicle theft motor insurance

As per the Motor Vehicle Act, you must inform your RTO (Regional Transport Office) about car theft.
Story first published: Thursday, January 20, 2022, 17:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X