For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్ ఫ్రాడ్‌కు చెక్, జనవరి 1 నుండి SBI కొత్త చెక్కు రూల్

|

న్యూఢిల్లీ: చెక్కు చెల్లింపుల కోసం జనవరి 1, 2021 నుండి కొత్త రూల్స్ అమలులోకి వస్తోన్న విషయం తెలిసిందే. పాజిటివ్ పేమెంట్ సిస్టంకు ఇప్పటికే ఆర్బీఐ ఆమోదం తెలిపింది. దీని కింద రూ.50,000కు పైగా ఉన్న చెక్కుల్ని అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితమవుతాయి. చెక్కు చెల్లింపులు చేసేవారికి పాజిటివ్ పే సిట్టంను దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అమలు చేయనుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్, పడిపోయిన ఆఫీస్ స్పేస్ లీజింగ్

బ్రాంచీని సంప్రదించవచ్చు

బ్రాంచీని సంప్రదించవచ్చు

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జనవరి 2021 నుండి పాజిటివ్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. రూ.50వేలు అంతకంటే ఎక్కువ మొత్తం చెక్ ద్వారా చెల్లింపులు చేసేవారు అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ జారీని చేసిన తేదీ, చెల్లింపుదారుని పేరు, మొదలైన వివరాలన తమకు తెలియజేయాలని ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. పాజిటివ్ పే సిస్టం ఎంపిక, సందేశాలు, సమస్యలు ఉంటే సమీపంలోని బ్యాంకు బ్రాంచీని సంప్రదించాలని ఎస్బీఐ సూచించింది.

మరోసారి ధృవీకరించుకోవడమే..

మరోసారి ధృవీకరించుకోవడమే..

చెక్కులోని వివరాలను మరోసారి ధృవీకరించుకోవడమే పాజిటివ్ పే ముఖ్య ఉద్దేశ్యం. ఎక్కువ వ్యాల్యూతో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కులో పేర్కొన్న తేదీ, లబ్దిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, అమౌంట్ వంటి వివరాలు పాజిటివ్ పే వ్యవస్థ ద్వారా మరోసారి నిర్ధారణ చేసుకుంటారు. చెక్ జారీ చేసేవారు ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం మొదలైన ఛానల్స్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా చెక్కులోని కనీస వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి.

క్రాస్ చెక్

క్రాస్ చెక్

వివరాలను సీటీఎస్ సమర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే అలాంటి చెక్కులను బ్యాంకు నిలిపివేస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొని తమకు కావాల్సిన చిరునామాకు చెక్ బుక్ డెలివరీ కోసం అభ్యర్థించవచ్చునని ఎస్బీఐ ఇదివరకు తెలిపింది.

English summary

బ్యాంకింగ్ ఫ్రాడ్‌కు చెక్, జనవరి 1 నుండి SBI కొత్త చెక్కు రూల్ | SBI to roll out new cheque book system from January 1

New cheque book rules: State Bank of India (SBI) is the biggest public sector bank and also has a massive customer base. Millions of people trust the largest public lender with their money.
Story first published: Wednesday, December 30, 2020, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X