For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KYC Fraud alert: అలా చేయకండి... కస్టమర్లకు SBI హెచ్చరిక

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు కేవైసీ (నో యువర్ కస్టమర్-KYC) ఫ్రాడ్‌కు సంబంధించి జాగ్రత్తలు జారీ చేసింది. కేవైసీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు సూచించింది. ఆన్‌లైన్ ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. కేవైసీ మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇందులో ఎస్బీఐ ఖాతాదారులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. దీంతో బ్యాంకు కస్టమర్లకు కేవైసీ ఫ్రాడ్ హెచ్చరికలు జారీ చేసింది.

KYC ధృవీక‌ర‌ణ పేరిట సైబ‌ర్ నేరగాళ్లు క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌ల వేస్తున్నారని, కాబట్టి ఖాతాదారులు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా కస్టమర్లకు సూచన చేసింది.

SBI పేరిట ఎస్సెమ్మెస్, వాట్సాప్ ద్వారా వ‌చ్చే KYC అప్‌డేట్ లింక్స్‌ను ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. సైబర్ మోసాల పైన ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే http://cybercrime.gov.in అనే పోర్ట‌ల్ ద్వారా చేయవచ్చునని ఆ ట్వీట్‌లో పేర్కొంది. KYC అప్‌డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్‌ను పంపించవని స్పష్టం చేసింది. కస్టమర్లు మొబైల్ నెంబర్, ఖాతా వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్ నెంబర్, ఓటీపీ వంటి సున్నిత వివరాలను ఎవరితోను పంచుకోవద్దని సూచించింది. అలాగే గుర్తు తెలియని ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల బారినప‌డి మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చరించింది.

SBI shares tips to avoid KYC frauds

- అనుమానితంగా వచ్చిన ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్‌ను అవాయిడ్ చేయాలి. వాటి పైన క్లిక్ చేయవద్దు.
- టెలిఫోన్ కాల్స్ లేదా గుర్తు తెలియని వారి నుండి వచ్చిన ఈ-మెయిల్స్ ద్వారా వచ్చే మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేయవద్దు.
- ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, డెబిట్ కార్డు నెంబర్, పిన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ వంటి వాటిని షేర్ చేయవద్దు.
- కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకు ఎలాంటి లింకులు పంపించదు.

English summary

KYC Fraud alert: అలా చేయకండి... కస్టమర్లకు SBI హెచ్చరిక | SBI shares tips to avoid KYC frauds

A lot of online fraud has been on the rise lately, one such being the KYC fraud that targets vulnerable banking customers.
Story first published: Friday, November 12, 2021, 10:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X