For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Salary Account: వివిధ శాలరీ అకౌంట్స్ గురించి తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వివిధ శాలరీ అకౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ సంస్థలు లేదా కంపెనీలకు ప్రత్యేక శాలరీ అకౌంట్ ప్యాకేజీని అందిస్తోంది. ఎస్బీఐ శాలరీ అకౌంట్‌లో ఎనిమిది రకాలు ఉన్నాయి.

కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (CSP)

కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (CSP)

హాస్పిటల్స్, హోటల్స్, ట్రాన్సుపోర్ట్ కంపెనీలు సహా వివిధ సేవా సంస్థల్లోని కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (CSP) ప్రయోజనకరం. నికర నెల వేతనం ఆధారంగా రూ.1,00,000కు పైగా వేతనం ఉంటే ప్లాటినమ్, రూ.50,000 నుండి రూ.1,00,000 ఉంటే డైమండ్, రూ.25,000 నుండి రూ.50,000 వరకు ఉంటే గోల్డ్, రూ.10,000 నుండి రూ.25,000 వరకు వేతనం ఉంటే సిల్వర్.

ప్రభుత్వ ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగులు

కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, నాబార్డు ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (CGSP) ఇది.నెట్ మంత్లీ శాలరీ రూ.10,000 నుండి రూ.25,000 మధ్య ఉంటే సిల్వర్, రూ.25,000 నుండి రూ.50,000 ఉంటే గోల్డ్, రూ.50,000 నుండి రూ.1,00,000 ఉంటే డైమండ్, రూ.1,00,000కు పైన ఉంటే ప్లాటినమ్.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఉద్యోగులతో పాటు రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్పోరేషన్లు బోర్డ్స్ ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ(SGSP). సిల్వర్: రూ.10,000/- నుండి రూ.25,000/-, గోల్డ్: రూ.25,000 నుండి రూ.50,000/- వరకు, డైమండ్: రూ.50,000 నుండి రూ.1,00,000/- వరకు, ప్లాటినమ్: రూ.1,00,000/- కు పైన.

రైల్వే శాలరీ ప్యాకేజీ(RSP)

రైల్వే శాలరీ ప్యాకేజీ(RSP)

ఇండియన్ రైల్వే ఉద్యోగులు, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వే కార్పోరేషన్, ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో ఉద్యోగులకు రైల్వే శాలరీ ప్యాకేజీ(RSP) అందుబాటులో ఉంటుంది. ఉద్యోగి వేతనం ఆధారంగా సిల్వర్: రూ.10,000/- నుండి రూ.25,000/- వరకు, గోల్డ్: రూ.25,000 నుండి రూ.50,000/- వరకు, డైమండ్: రూ.50,000 నుండి రూ.1,00,000/- వరకు, ప్లాటినమ్ రూ.1,00,000/-కు పైన.

డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (DSP)

డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (DSP)

డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (DSP) కింద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్, జీఆర్ఈఎఫ్ వస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్, ఆర్ఆర్, జీఆర్ఈఎఫ్‌లలో పని చేసే వారి ర్యాంకును బట్టి గోల్డ్, డైమండ్, ప్లాటినం ఉన్నాయి. ఆఫీసర్లలోను డైమండ్ లేదా ప్లాటినమ్ వేరియంట్స్ ఉన్నాయి.

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ (CAPSP)

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ (CAPSP)

సెంటర్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు ఈ అకౌంట్ ప్యాకేజీ ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఓపెన్ చేయవచ్చు లేదా సీఏపీఎస్పీ అకౌంట్ కిందకు మార్చుకోవచ్చు. ఇన్సురెన్స్, ఓవర్ డ్రాఫ్ట్, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ మినహా అన్ని ప్రయోజనాలు ఉంటాయి.

పోలీస్ శాలరీ ప్యాకేజీ (PSP)

పోలీస్ శాలరీ ప్యాకేజీ (PSP)

అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సివిల్ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్, రిజర్వ్ పోలీస్, గవర్నమెంట్ రైల్వే పోలీస్, (పార్ట్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఫోర్స్) కోసం పోలీస్ శాలరీ ప్యాకేజీ. సిల్వర్: నెట్ మంత్లీ శాలరీ రూ.10,000 నుండి రూ.25,000 వరకు, గోల్డ్: నెట్ మంత్లీ శాలరీ రూ.25,001 నుండి రూ.50,000 వరకు, డైమండ్: నెట్ మంత్లీ శాలరీ రూ.50,001 నుండి రూ.1,00,000 వరకు, అలాగే ఎస్పీ అండ్ హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్‌కు కూడా డైమండ్ వర్తిస్తుంది. ప్లాటినమ్: నెట్ మంత్లీ శాలరీ రూ.1,00,000. అలాగే రూ. డీఐజీ, హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్స్

ఇండియన్ కోస్డ్ గార్డ్ శాలరీ ప్యాకేజీ (ICGSP)

ఇండియన్ కోస్డ్ గార్డ్ శాలరీ ప్యాకేజీ (ICGSP)

ఇండియన్ కోస్డ్ గార్డ్ ఉద్యోగులకు ఇండియన్ కోస్డ్ గార్డ్ శాలరీ ప్యాకేజీ (ICGSP). ఉద్యోగుల వారీగా చూస్తే గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఓపెన్ చేయవచ్చు. అలాగే అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

English summary

SBI Salary Account: వివిధ శాలరీ అకౌంట్స్ గురించి తెలుసుకోండి | SBI Salary Account: Here’s All You Need To Know About

State Bank of India (SBI) offers a wide variety of Salary Accounts to meet the specific requirements of its customers. The bank has customised Salary Account Packages for a multitude of sectors, including the central govt, state government, the military, paramilitary forces, police forces, and corporations/institutions.
Story first published: Thursday, May 13, 2021, 18:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X