For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కొత్త రూల్: పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) చెక్కుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌కు మరింత భద్రత కోసం పాజిటివ్ పే సిస్టంను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త రూల్ ప్రకారం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపులకు కీలక వివరాలు పునఃనిర్ధారణ అవసరం. ఈ నియమాలు జనవరి 1, 2021 నుండి అమల్లోకి వచ్చాయి. ఇందులో అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్కు వ్యాల్యూ, చెక్కు చెల్లింపులకు సంబంధించిన తేదీ, చెల్లిస్తున్న వారి పేరు వంటి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.

SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..SBI యోనో యాప్‌‍తో ఉచితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి ఇలా..

ఎస్బీఐ కొత్త రూల్... తెలుసుకోండి

ఎస్బీఐ కొత్త రూల్... తెలుసుకోండి

పాజిటివ్ పే ప్రక్రియలో అధిక వ్యాల్యూ కలిగిన చెక్కుల ముఖ్యమైన వివరాలు తిరిగి ధృవీకరించే ప్రక్రియ ఉంటుంది.

చెక్కు ఇచ్చేవారు ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా ఎస్బీఐకి అవసరమైన వివరాలు సమర్పించాలి.

చెక్కు కొన్ని కనీస వివరాలు అందించాలి.

ఏదైనా తేడా ఉందని సీటీఎస్ గుర్తిస్తే బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటాయి.

ఈ సదుపాయాన్ని కల్పించాలని నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఆర్బీఐ ఆదేశించింది. దీంతో వారు డేటాను త్వరగా ధృవీకరించేందుకు సీటీఎస్‌కు నేరుగా అనుసంధానం ఉంటుంది.

ఎస్బీఐ అకౌంట్ హోల్డర్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ చిరునామాకు చెక్ బుక్ డెలివరీ కోసం విజ్ఞప్తి చేసుకోవచ్చు.

ఈ వివరాలు అవసరం

ఈ వివరాలు అవసరం

పాజిటివ్ పే సిస్టం ద్వారా చెక్ పేమెంట్స్ మరింత సురక్షితం. చెక్కు కోసం అందించాల్సిన వివరాల్లో అకౌంట్ నెంబర్, చెక్కు నెంబర్, చెక్కు అమౌంట్, చెక్కు తేదీ, చెల్లింపుదారు లేదా లబ్ధిదారు, ఇన్‌స్ట్రుమెంట్ టైప్ వంటి వివరాలు అందించాలి.

ఫ్రాడ్‌స్టర్స్ పట్ల జాగ్రత్త

ఫ్రాడ్‌స్టర్స్ పట్ల జాగ్రత్త

ఇదిలా ఉండగా, ఫేక్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఫ్రాడ్ చేసి, డబ్బులు అకౌంట్లో నుండి గుంజేవాళ్లు ఉంటారు. ఎస్బీఐ కూడా మరోసారి మ కస్టమర్లకు సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

English summary

SBI కొత్త రూల్: పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి | SBI new rule to clear high value cheques

State Bank of India (SBI) has rolled out the 'positive pay system' for cheques. Under the new rule re-confirmation of key details will be needed for payments beyond ₹50,000.
Story first published: Tuesday, January 5, 2021, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X