For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేవారికి గుడ్‌న్యూస్: SBI వీడియో కేవైసీ సేవింగ్ అకౌంట్

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా KYC ఆధారిత సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. యోనో మొబైల్ యాప్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫీచర్‌ని ఉపయోగించుకుని కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పేపర్‌లెస్‌గా పొదుపు ఖాతా తెరుచుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐలో కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే వారికి ఇది వీడియో కేవైసీ ఫీచర్ అందుబాటులో ఉంది.

ఆర్థిక రికవరీపై ప్రభావం, సెకండ్ వేవ్ పెను సవాల్: ఆర్బీఐ గవర్నర్ఆర్థిక రికవరీపై ప్రభావం, సెకండ్ వేవ్ పెను సవాల్: ఆర్బీఐ గవర్నర్

ఇలా ఓపెన్ చేయవచ్చు

ఇలా ఓపెన్ చేయవచ్చు

- వీడియో కేవైసీ ఆధారిత సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మొదట యోనో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

- New to SBI పైన క్లిక్ చేయండి.

- Insta Plus Savings Account ను ఎంచుకోవాలి.

- అక్కడ ఆధార్ కార్డు వివరాలు అందించాలి.

- ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అడిగిన ఇతర వ్యక్తిగత వివరాలు పేర్కొనవలసి ఉంటుంది.

- కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి వీడియో కాల్ షెడ్యూల్ చేయాలి.

ఆటోమేటిక్‌గా ఓపెన్

ఆటోమేటిక్‌గా ఓపెన్

- వీడియో కేవైసీ పూర్తయిన తర్వాత అకౌంట్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.

- కరోనా పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు బ్రాంచీకి వెళ్లకుండానే ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.

- కరోనా నేపథ్యంలో ఇప్పటికే వివిధ బ్యాంకులు వివిధ సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నాయి.

డిజిటల్ దిశగా

డిజిటల్ దిశగా

కరోనా పరిస్థితుల్లో ఆన్ లైన్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ అవశ్యమని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా అన్నారు. కస్టమర్ల సేఫ్టీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్‌ను నిర్ధారిస్తుందన్నారు. ఇది మొబైల్ బ్యాంకింగ్‌కు కొత్త కోణాన్ని జోడిస్తుందని, ఖాతాదారుల బ్యాంకింగ్ అవసరాలు డిజిటల్ దిశగా ప్రోత్సహిస్తుందన్నారు.

English summary

బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేవారికి గుడ్‌న్యూస్: SBI వీడియో కేవైసీ సేవింగ్ అకౌంట్ | SBI Launches Video KYC Based Savings Account Opening For Customers

State Bank of India (SBI), has launched a Video KYC based account opening feature on its mobile banking app – YONO. The Video KYC based account opening feature functionality will help individuals open an account with SBI without having to visit a bank branch.
Story first published: Sunday, April 25, 2021, 13:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X