For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI gold loan: మిస్డ్ కాల్ ఇస్తే చాలు... అర్హత, వడ్డీ రేటు ఎంత తక్కువ అంటే?

|

అత్యవసర సమయంలో, వేగవంతమైన రుణం కోసం చాలామంది పసిడి రుణాలు తీసుకుంటారు. వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు బంగారానికి వ్యాల్యూను కట్టి రుణాలు ఇస్తుంటాయి. తాత్కాలిక డబ్బు అవసరం తీరేందుకు అతి తక్కువ పేపర్ వర్క్‌తో వివిధ సంస్థలు రుణాలు ఇస్తాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంగారంపై రుణాలు ఇస్తోంది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్ వంటివి తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ఎస్బీఐ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం వడ్డీ రేటు 7.5 శాతం. ప్రాసెసింగ్ ఫీజు ఏమీ లేదు.

ఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండిఒక్క మిస్డ్ కాల్‌తో SBI నుండి రూ.25 లక్షల రుణం: అర్హులెవరు.. ఇలా చేయండి

మిస్ కాల్ ద్వారా బంగారం రుణం

మిస్ కాల్ ద్వారా బంగారం రుణం

7208933143కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా 7208933145 నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా బంగారంపై రుణాలు పొందవచ్చునని ఎస్బీఐ ట్వీట్ చేసింది. మిస్డ్ కాల్ ఇచ్చినా, ఎస్సెమ్మెస్ చేసినా బ్యాంకు నుండి కాల్ బ్యాక్ చేస్తారు. 7.5 శాతం వడ్డీకే బంగారంపై రుణాలు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం అదనపు ప్రయోజనంగా తెలిపింది.

రుణానికి అర్హులు ఎవరంటే

రుణానికి అర్హులు ఎవరంటే

రుణం తీసుకునే వారు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.ఇండివిడ్యువల్ (సింగిల్ లేదా జాయింట్‌గా) ఎవరైనా రుణం తీసుకోవచ్చు. నిలకడైన ఆదాయం ఉన్న వారికి రుణం ఇస్తారు. బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీసుకోవచ్చు. ఆదాయానికి సంబంధించిన ఆధారాలు అవసరం లేదు.గరిష్టంగా రూ.50 లక్షలు రుణం తీసుకోవచ్చు. కనీసం రూ.20,000 ఇస్తారు.

యోనో ద్వారా రుణం తీసుకుంటే

యోనో ద్వారా రుణం తీసుకుంటే

ప్రాసెసింగ్ ఫీజు భారం ఎక్కువగా లేదు. లోన్ అమౌంట్ పైన 0.25 శాతం, కనీస రూ.250 జీఎస్టీ ఉంటాయి. యోనో ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు లేదు.రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత అన్ని ఆభరణాలు అప్పగిస్తారు.మార్జిన్స్ ఇలా ఉన్నాయి.. గోల్డ్ లోన్ 25 శాతం, లిక్విడ్ గోల్డ్ లోన్ 25 శాతం, బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ 35 శాతం.గోల్డ్ లోన్ పైన రుణాలు పంపిణీ చేసిన తర్వాత నెల తర్వాత నుండి అసలు, వడ్డీ తిరిగి చెల్లించడం ప్రారంభమవుతుంది.

డాక్యుమెంట్స్

డాక్యుమెంట్స్

అప్లికేషన్ కోసం రెండు ఫోటో గ్రాఫ్స్

చిరునామాతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్.

నిరక్షరాస్యులైన రుణగ్రహీతలు అయితే విట్‌నెస్ లెటర్.

గోల్డ్ లోన్ రుణాలు చెల్లించడానికి కాలపరిమితి 36 నెలలు, లిక్విడ్ గోల్డ్ లోన్ 36 నెలలు, బుల్లెట్ రీపెమెంట్ గోల్డ్ లోన్ 12 నెలలు.

English summary

SBI gold loan: మిస్డ్ కాల్ ఇస్తే చాలు... అర్హత, వడ్డీ రేటు ఎంత తక్కువ అంటే? | SBI gold loan: Check eligibility, interest rate and other features

A gold loan can prove to be a good option to take care of a temporary cash crunch or tide over a financial emergency. Gold loans can be availed quickly with minimum paperwork.
Story first published: Monday, February 22, 2021, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X