For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డులతో ఆఫ్‌లైన్ చెల్లింపులు, ఆర్బీఐ సరికొత్త డిజిటల్ పేమెంట్ పైలట్!

|

మొబైల్ డివైస్‌లు, కార్డుల ద్వారా జరిపే చెల్లింపుల పరిమాణాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకోనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రతా చర్యల కోసం ఈ దిశలో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఒక పైలట్ స్కీంను తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడించనున్నట్లు చెప్పారు.

మీ చేతికి ఎక్కువ డబ్బు: బంగారు ఆభరణాల రుణాలపై ఆర్బీఐ గుడ్‌న్యూస్

ప్రయోగాత్మకంగా ఆఫ్‌లైన్ చెల్లింపులు

ప్రయోగాత్మకంగా ఆఫ్‌లైన్ చెల్లింపులు

ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్పీడ్ తక్కువగా ఉండటంతో పాటు ఇప్పటి వరకు డిజిటల్ పేమెంట్స్‌లో ఏర్పడుతున్న అన్ని సమస్యలను పరిగణలోకి తీసుకొని ఈ విభాగంలో మరింత ముందుకు వెళ్లేలా చర్యలు ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. ఇందుకు కార్డులు, మొబైల్ డివైస్‌లు ఉపయోగించి రూ.200 వరకు ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు ఆమోదించే కొత్త పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా వివిధ సంస్థలు, ఆఫ్‌లైన్ పేమెంట్ సొల్యూషన్లు అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది. వీటికి సంబంధించి ఆదేశాలు త్వరలో ఆఱ్బీఐ జారీ చేయనుంది.

స్టార్టప్స్‌కు ప్రాధాన్యత

స్టార్టప్స్‌కు ప్రాధాన్యత

ప్రాధాన్యతా రుణాల పరిధిని మరింత విస్తరించనుంది ఆర్బీఐ. స్టార్టప్స్‌ను కూడా ప్రాధాన్యతా రుణాల పరిధిలోకి తీసుకు వస్తాయి. పునరుత్పాదక ఇంధన రంగానికి రుణపరిమితిని పెంచడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు, బలహీన వర్గాలకు రుణ లక్ష్యాలను పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు ఇకపై 40 శాతం రుణాలను లేదా తమ పద్దుల్లో దాంతో సమానమైన మొత్తాన్ని ఏది ఎక్కువైతే అంత మొత్తాన్ని ప్రాధాన్యతా రంగాలకు కేటాయించాలి.

అలాగే, చిన్న రుణాలు ఇచ్చేవారు, గృహ రుణ కంపెనీలకు సాయం చేసేందుకు నాబార్డు, ఎన్‌హెచ్‌బీలకు అదనంగా ప్రత్యేక ద్రవ్య లభ్యత సదుపాయం కింద రూ.5,000 కోట్ల చొప్పున రూ.10,000 కోట్లను ప్రకటించింది.

కార్పోరేట్, రిటైల్ రుణాలు తీసుకునే వారికి కూడా ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కరోనా వల్ల ఒత్తిడి ఎదుర్కొంటున్న వీరికి వన్ టైమ్ రుణ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు రుణాల కొనసాగింపుకు ఆమోదం తెలిపింది.

ముఖ్య విషయాలు

ముఖ్య విషయాలు

- రెపో రేటును (4 శాతం), రివర్స్ రెపో రేటును (3.35 శాతం) యథాతథంగా ఉంచింది ఆర్బీఐ.

- బంగారం విలువలై రుణ పరిమితిని 75 శాతం నుండి 90 శాతానికి పెంచింది.

- ఖరీఫ్ దిగుబడి కారణంగా గ్రామీణ డిమాండ్ పెరగవచ్చునని అంచనా వేసింది.

- కస్టమర్లకు కరెంట్ అకౌంట్లు, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ల ప్రారంభంలో భద్రతా ప్రమాణాలు మరింత పెంపు.

- ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండవచ్చునని తెలిపింది.

- ఎంఎస్ఎంఈల ఖాతాలు ప్రామాణీక వర్గీకరణ కింద ఉంటే రుణ పునర్నిర్మాణానికి అర్హత ఉంటుంది.

- కార్పోరేట్, వ్యక్తిగత రుణాల పునర్నిర్మాణానికి కూడా బ్యాంకులు అనుమతించవచ్చు.

- అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం చేసేందుకు, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులో తేవడానికి, బ్యాంకింగ్ సేవల పటిష్టత లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగం లేదా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు నిర్ణయం

- ప్రాధాన్యతా రంగాల్లోకి స్టార్టప్స్.

- ఆఫ్‌లైన్ పద్ధతిలో చిన్న వ్యాల్యూ చెల్లింపుల కోసం పైలట్ పథకం

- నాబార్డు, ఎన్‌హెచ్‌బీలకు రూ.10,000 కోట్లు.

- పరపతి విధాన కమిటీ ద్రవ్యోల్భణ లక్ష్యాన్ని 4 శాతంగా నిర్ణయించింది.

- ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ కారణంగా వెనుకడుగు వేసింది.

- ప్రాధాన్యతా రంగాల రుణం కింద పునరుత్పాదక ఇంధన రంగాలకు రుణ పరిమితులు పెంపు.

English summary

RBI announces a slew of measures for boost digital payments

The RBI on Thursday announced a slew of measures targeted to boost digital payments, enhance the scope of priority sector lending, and drive innovation in the broader financial ecosystem.
Story first published: Friday, August 7, 2020, 9:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X