Petrol, diesel price: పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా లెక్కిస్తారు?
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105కు పైన, తెలుగు రాష్ట్రాల్లో రూ.120 వద్ద ఉంది. సామాన్యులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడకుండా గత నవంబర్ నెలలో కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 సుంకాన్ని తగ్గించింది. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఆయా వ్యాట్‌కు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో ధరలు వివిధ రకాలుగా ఉన్నాయి.

ఇక్కడ పెట్రోల్ ధరలు ఎంతంటే
తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, డీజిల్ రూ.105.49గా ఉంది. తమిళనాడులో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94, పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ రూ.121, డీజిల్ రూ.103.88, జార్ఖండ్‌లో పెట్రోల్ రూ.108.67, డీజిల్ రూ.102.02, మహారాష్ట్రలో పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77, ఢిల్లీలో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.97, కేరళలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.102.26గా ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోల్ రూ.105,24గా ఉంది.

ధరలపై ఈ ప్రభావం
చమురు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దీనిని రిఫైన్ చేసి విక్రయిస్తాయి. కాబట్టి ఓఎంసీ ఖర్చు, ఆ తర్వాత కేంద్ర పన్నులు, రాష్ట్రాల వ్యాట్, డీలర్ లాభం వంటివి ఉంటాయి. ప్రధానంగా బేస్ ధర, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్ ఉంటాయి.
ఉదాహరణకు బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 105 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌లో 159 లీటర్లు ఉంటుంది. క్రూడ్ ధర ఒక లీటర్‌కు అంటే బేస్ ధర రూ.40 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఎంట్రీ ట్యాక్స్, రిఫైనరీ ప్రాసెసింగ్, ఓఎంసీ మార్జిన్, రవాణా ఖర్చులు ఉంటాయి. రాష్ట్రాల వ్యాట్, కేంద్రం ఎక్సైజ్ పన్ను, డీలర్ ఛార్జీ ఉంటాయి. ఇవన్నీ కలిసి పెట్రోల్ రూ.100 క్రాస్ చేస్తుంది.

ఆదాయం తగ్గి...
గత నవంబర్ నెలలో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన సెస్ తగ్గించడంతో రూ.8700 కోట్ల ప్రభావం పడింది. దీంతో ఖజానాకు రూ.1 ట్రిలియన్ల నష్టం వాటిల్లుతోంది. ఇదే కాలంలో వ్యాట్ తగ్గించిన రాష్ట్రాల ఆదాయం కూడా రూ.15,969 కోట్లు తగ్గింది. ఇందులో కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే రూ.11,398 కోట్లు తగ్గాయి. అయితే కేంద్రం సెస్ పెంచిందని, దీంతో పెట్రో భారంగా మారిందని చెబుతున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో కోట్లాదిమంది ప్రజలకు కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కల్యాన్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సరఫరా చేస్తోంది. దీనికి 3.4 ట్రిలియన్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.