For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి

|

నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) FASTagలను భీమ్ యాప్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకునె వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. దీంతో FASTag రీఛార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కానుందని సంస్థ సీవోవో ప్రవీణ్ రాయ్ వెల్లడించారు.

ఫాస్టాగ్‌కుసంబంధించి మరిన్ని కథనాలు...

ఇప్పుడు భీమ్ యాప్ కూడా..

ఇప్పుడు భీమ్ యాప్ కూడా..

భీమ్ యాప్ ద్వారా కూడా FASTagను రీఛార్జ్ చేసుకోవచ్చునని NPCI గురువారం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులతో పాటు కొన్ని ప్రయివేటు బ్యాంకులు, పేటీఎం వంటి యాప్స్ ద్వారా FASTagను రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు భీమ్ యాప్‌లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. భీమ్ యాప్ కలిగిన వాహనదారు యజమాని ఇక నుంచి FASTagను రీఛార్జ్ చేసుకోవచ్చునని, తద్వారా టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండే అవసరం లేదని ఓ ప్రకటనలో NPCI తెలిపింది.

ఎలా చేసుకోవాలి?

ఎలా చేసుకోవాలి?

- భీమ్ యాప్ ద్వారా వినియోగదారులు సులభంగా FASTagను రీఛార్జ్ చేసుకోవచ్చు.

- BHIM UPI యాప్‌లోకి లాగిన్ కావాలి.

- సెండ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

- NETC FASTag UPI IDని ఎంటర్ చేయాలి.

- యూపీఐని వెరిఫై చేసేందుకు క్లిక్ చేయమని అడుగుతుంది.

- రీఛార్జ్ ఎంత కావాలో ఎంటర్ చేయాలి.

- అథంటికేషన్ కోసం పిన్ ఎంటర్ చేయండి.

- అప్పుడు వాహనదారులు ఫాస్టాగ్ వ్యాలెట్‌కు క్రెడిట్‌ను నిర్ధారించే ఓ ఎస్సెమ్మెస్ వస్తుంది.

టోల్ ప్లాజాల వద్ద ఈజీగా...

టోల్ ప్లాజాల వద్ద ఈజీగా...

టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల చెల్లింపులు వేగవంతం చేసే క్రమంలో భాగంగా FASTag విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త విధానంవల్ల టోల్ చెల్లింపుకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాదు. ఇంధనం ఆదా అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద క్రమంగా క్యూలైన్లు తగ్గుతాయి. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే FASTagలను వాహనం విండ్ స్క్రీన్ పైన అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్‌ చేస్తాయి. తద్వారా వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది. రెండు రోజుల క్రితం వరకు 1.10 కోట్ల ఫాస్టాగ్స్ జారీ చేసినట్లు NETC తెలిపింది.

English summary

BHIM UPI యాప్ ద్వారా కూడా FASTag రీఛార్జ్, ఇలా చేయండి | NPCI announces NETC FASTag recharge option through BHIM UPI

National Payments Corporation of India (NPCI) with the objective to provide all vehicle owners the convenience of NETC FASTag recharge, is now offering customers the option to recharge via BHIM UPI as well.
Story first published: Friday, December 27, 2019, 8:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X