For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమిషాల్లోనే ఉచితంగా పాన్‌కార్డు తీసుకోండి, ఇలా చేయండి

|

ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకోవచ్చు. పాన్ కార్డు తీసుకోవడానికి రెండు పేజీల్లో వివరాలు నింపి, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వేచి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఆధార్ కార్డు ద్వారా కొద్ది నిమిషాల్లోనే ఆన్ లైన్ మార్గం ద్వారా పాన్ కార్డును తీసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను శాఖ కల్పించింది.

కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్‌కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రంకొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్‌కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం

ఈ పాన్ కార్డు ఉచితం

ఈ పాన్ కార్డు ఉచితం

ఐటీ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా కేవలం పది నిమిషాల్లోనే ఈ పాన్ కార్డును పొందవచ్చు. మరో ప్రయోజకర విషయం ఏమంటే ఈ పాన్ కార్డు పూర్తిగా ఉచితం.

పది నిమిషాల్లో.. KYC పూర్తి చేశాక..

పది నిమిషాల్లో.. KYC పూర్తి చేశాక..

ఈ-పాన్ కార్డ్ పొందేందుకు మీరు ఆధార్ కార్డు వివరాలు సమర్పించవలసి ఉంటుంది. ఆ తర్వాత KYC ప్రక్రియ పూర్తి చేసేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. KYC పూర్తి చేసిన తర్వాత పాన్ కార్డు నెంబర్ వెంటనే జారీ చేస్తారు. అయితే ఇది ఈ-పాన్ నెంబర్. పీడీఎఫ్ రూపంలో దరఖాస్తుదారుకు అందుతుంది.

ప్రింటెడ్ లామినేటెడ్ కాపీ కోసం రూ.50

ప్రింటెడ్ లామినేటెడ్ కాపీ కోసం రూ.50

ఈ-పాన్ కార్డ్ వ్యాలిడ్ అయినప్పటికీ మీకు లామినేటెడ్ పాన్ కార్డు కావాలంటే మాత్రం రూ.50 చెల్లించవలసి ఉంటుంది. దీని ప్రింటెడ్ కాపీ కోసం ఆర్డర్ చేయవలసి ఉంటుంది.

తక్షణ పాన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

తక్షణ పాన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..

- ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి లెఫ్ట్ సైడ్‌లోని Quick Links విభాగంలోని Instant PAN through Aadhaar పైన క్లిక్ చేయాలి.

- Get New PAN పైన క్లిక్ చేయాలి.

- కొత్త పాన్ కార్డు కోసం మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కాప్చా ఎంటర్ చేయాలి.

- ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది.

- OTP, ఆధార్ వివరాలు ధృవీకరించాలి. పాన్ కార్డు అప్లికేషన్ కోసం మీ ఈ-మెయిల్ ఐడీని ధృవీకరించవలసి ఉంటుంది. అప్పుడు ఈ మెయిల్‌కు పాన్ వస్తుంది.

పది నిమిషాల్లో..

పది నిమిషాల్లో..

- KYC ప్రక్రియలో భాగంగా మీరు అందించిన డేటాను UIDAI వద్దనున్న సమాచారంతో సరిపోలుస్తారు. ఆ వెంటనే ఈ పాన్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియకు 10 నిమిషాల సమయం పడుతుంది.

- పాన్ కార్డును పీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

- ఇందుకు చెక్ స్టేటస్ లేదా డౌన్ లోడ్ పాన్ అప్షన్ ఎంచుకొని, ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- ఆధార్‌తో ఈ-మెయిల్ అనుసంధానమై ఉంటే పాన్ పీడీఎఫ్ మెయిల్ రూపంలో వస్తుంది.

ఇదివరకు తీసుకోకుంటే అర్హులు

ఇదివరకు తీసుకోకుంటే అర్హులు

ఈ-పాన్ కార్డు పూర్తిగా ఉచితం. దరఖాస్తు కూడా పది నిమిషాల్లో పూర్తవుతుంది. సులభ ప్రక్రియ. ఇదివరకు పాన్ కార్డు తీసుకోని వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలి. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ వివరాలు తేదీ.. నెల, సంవత్సరం ఫార్మాట్‌లో ఉండాలి.

English summary

నిమిషాల్లోనే ఉచితంగా పాన్‌కార్డు తీసుకోండి, ఇలా చేయండి | Now, get a free PAN card in just 10 minutes

Now, in order to get a new PAN card, you need not fill up a 2-page detailed application form and wait for a few days for it to be delivered. The income tax department has launched a new facility for taxpayers allowing anyone with an Aadhaar card to get an instant PAN card online.
Story first published: Sunday, February 23, 2020, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X