For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెక్కు చెల్లింపుల్లో కొత్త రూల్, జనవరి 1 నుండి గుర్తుంచుకోండి: కానీ మీ ఇష్టం!

|

న్యూఢిల్లీ: చెక్కు చెల్లింపుల కోసం కొత్త రూల్స్ వస్తున్నాయి. ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టంను తీసుకు వస్తోంది. దీనిని ఆగస్ట్ 1వ తేదీ నుండి అమలు చేయడానికి ప్లాన్ చేసింది. అయితే ఆలస్యమై, జనవరి 1, 2021 నుండి అమలులోకి వస్తోంది. ఆర్బీఐ పాజిటివ్ పేమెంట్ సిస్టం ద్వారా పేమెంట్స్ చేసేందుకు అంగీకరించింది. దీనికింద రూ.50,000కు పైగా ఉన్న చెక్కుల్ని అవసరమైన సమాచారం కోసం మళ్లీ నిర్ధారించనున్నారు. ఈ విధానంతో చెక్కు చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి.

 8.5 శాతం చొప్పున.. డిసెంబర్ చివరి నాటికి ఈపీఎఫ్ వడ్డీ 8.5 శాతం చొప్పున.. డిసెంబర్ చివరి నాటికి ఈపీఎఫ్ వడ్డీ

కొత్త రూల్స్

కొత్త రూల్స్

బ్యాంకు మోసాలు అరికట్టేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆర్బీఐ పాజిటివ్ పే సిస్టంను ప్రవేశపెడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం చెక్కులు జారీ చేసే వ్యక్తి చెక్కు తేదీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో గ్రహీత పేరు, చెల్లింపు మొతతాన్ని తిరిగి చేయవలసి ఉంటుంది. చెక్కు జారీ చేసే వ్యక్తి ఎస్సెమ్మెస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా ఈ సమాచారాన్ని అందించవచ్చు. చెక్ చెల్లింపుకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేస్తారు.

రూ.50,000 దాటితే..

రూ.50,000 దాటితే..

ఏదైనా లోపం కనిపిస్తే అది చెక్ ట్రంకేషన్ సిస్టం ద్వారా గుర్తిస్తుంది. సమాచారాన్ని చెక్ చెల్లింపు చేయవలసిన బ్యాంకు, చెక్కు జారీ చేసిన బ్యాంకులకు అందుతుంది. రూ.50,000 అంతకంటే ఎక్కువ చెల్లింపులకు సంబంధించి బ్యాంకులు, ఖాతాదారులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ ఈ సదుపాయం పొందే ఆప్షన్ కూడా ఉంది. ఇది ఖాతాదారు ఇష్టం.

రూ.5 లక్షలు, అంతకుమించిన చెక్కులకు సంబంధించి బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరి చేయవచ్చు. NPCI ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని బ్యాంకులకు అందుబాటులో తీసుకువచ్చింది.

పాజిటివ్ పే విధానం...

పాజిటివ్ పే విధానం...

NPCI ఈ పాజిటివ్ పే విధానాన్ని అభివృద్ధి చేసింది.

చెక్కు నెంబర్, తేదీ, చెల్లిస్తున్న వారి ఖాతా నెంబర్, ఎంత డబ్బు చెల్లిస్తున్నారనే విషయాలను బ్యాంకు అధికారులు చెక్కు ఇష్యూ చేసిన వ్యక్తితో మరోసారి ధృవీకరించుకుంటారు.

చెక్కు ఇష్యూ చేసే వ్యక్తి ఆ చెక్కు తేదీ, ఎవరికి ఇస్తున్నారు, ఎంత మొత్తం అనే విషయాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, ఎస్సెమ్మెస్, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా చెక్కు డ్రా చేసుకునే బ్యాంకుకు తెలపాలి.

ఈ వివరాలు పాజిటివ్ పే సిస్టంతో సేవ్ అవుతాయి. చెక్కు బ్యాంకుకు వచ్చినప్పుడు ఇష్యూ చేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో చెక్కుపై ఉన్న వివరాలను పోల్చి చూసి, అన్ని వివరాలు సరిపోలితే ప్రాసెస్ చేస్తారు. లేదంటే రిజెక్ట్ చేస్తారు.

పాజిటివ్ పే విధానం కస్టమర్ ఇష్టం. ఆప్షన్ ఎంచుకోవచ్చు. కానీ రూ.5 లక్షలకు మించిన పేమెంట్లపై బ్యాంకులు దీనిని తప్పనిసరి చేయవచ్చు.

English summary

చెక్కు చెల్లింపుల్లో కొత్త రూల్, జనవరి 1 నుండి గుర్తుంచుకోండి: కానీ మీ ఇష్టం! | New rule for cheque payments from January 1: What you must know

A new rule for cheque payments is all set to come into effect from 1st January, 2021. The new rule has been designed in order to check banking fraud. The Reserve Bank of India has decided to introduce from January 1, 2021, the 'positive pay system' for cheques, under which re-confirmation of key details may be needed for payments beyond Rs 50,000.
Story first published: Monday, December 14, 2020, 7:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X