For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Railways: IRCTCలో కన్ఫమ్ తత్కాల్ టిక్కెట్లు కావాలా..? అయితే ఇలా బుక్కింగ్ చేయండి..

|

Indian Railways: చివరి నిమిషంలో ట్రిప్ షెడ్యూల్ చేయవలసి వస్తే అంతా గందరగోళంగా అవుతుంది. ప్రయాణించాలనుకున్న గమ్యస్థానానికి ఉన్న అన్ని ప్రధాన రైళ్ల టిక్కెట్లు అప్పటికే అమ్ముడైపోయి ఉంటాయి. చాలా మంది రైల్వే వెబ్‌సైట్‌లో సీట్లు బుక్కింగ్స్ ఖాళీ లేవని తెలిసి నిరాశ చెందుతుంటారు. ప్రయాణ అత్యవసర సమయాల్లో తత్కాల్ బుకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. చివరి నిమిషంలో ప్రయాణానికి.. ఏదైనా రైలులో దాదాపు 7-10 శాతం సీట్లు IRCTC తత్కాల్ సిస్టమ్ ద్వారా బుక్ చేయబడతాయి.

తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఇలా..

తత్కాల్ టిక్కెట్లు అందుబాటులో ఇలా..

ఏ రైలుకైనా ప్రయాణ టిక్కెట్లు ట్రైన్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు అందుబాటులో ఉంటాయి. ఈ విండో స్లీపర్ టిక్కెట్లకు ఉదయం 11 గంటలకు, 3rd ఏసీ కంటే తక్కువ తరగతులకు మాత్రం ఉదయం 10 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. ఇవి రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్కింగ్ చేసుకోవచ్చు.

తత్కాల్ టిక్కెట్లలో సమస్యలు..

తత్కాల్ టిక్కెట్లలో సమస్యలు..

ఇలా టిక్కెట్ల కోసం చాలా మంది చివరి క్షణాల్లో IRCTC సైట్ కు వెళ్లి తత్కాల్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా, మెజారిటీ వినియోగదారులు 503 ఎర్రర్ నోటీసు వస్తుంది. ఇలాంటి సందర్భంలో త్వరగా టిక్కెట్లను పొందటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ చిట్కాలేంటంటే..

వివరాలను సిద్ధంగా ఉంచుకోండి..

వివరాలను సిద్ధంగా ఉంచుకోండి..

తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది సమయానికి సంబంధించినది కాబట్టి.. ప్రయాణీకుల పేర్లు, ప్రయాణ తేదీలు మొదలైనవాటితో సహా మీ మొత్తం సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవడం చాలా కీలకం.

జాబితా తయారీ..

జాబితా తయారీ..

IRCTC వెబ్‌సైట్ లో 'నా ప్రొఫైల్' విభాగానికి వెళ్లి, మొత్తం ప్రయాణీకుల సమాచారంతో మాస్టర్ జాబితాను క్రియేట్ చేయాలి. ఈ మాస్టర్ జాబితాను మీ తరువాతి బుకింగ్స్ కోసం ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. మీరు తత్కాల్ టిక్కెట్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రతి ట్రిప్ కోసం ప్రత్యేక 'ప్రయాణ జాబితా'ను రూపొందించండి. ఈ జాబితా నుంచి వివరాలను బుకింగ్ ప్రాసెస్ సమయంలో తిరిగి పొందవచ్చు. ఇది నిమిషాల వ్యవధిలో టిక్కెట్ బుక్ చేసుకోవటానికి చాలా కీలకంగా సహకరిస్తుంది.

స్టేషన్ కోడ్‌లను తనిఖీ..

స్టేషన్ కోడ్‌లను తనిఖీ..

ఇది చాలా మంది వ్యక్తులు చేసే సాధారణ తప్పిదం. IRCTC తత్కాల్ బుకింగ్ సెషన్‌ను ప్రారంభించే ముందు మీరు మీ సోర్స్, గమ్యస్థాన స్టేషన్‌ల గురించి ఒక ఆలోచన కలిగి ఉండటమే కాకుండా వాటి స్టేషన్ కోడ్‌లను నోట్‌ప్యాడ్ ఫైల్‌లో కాపీ చేసి ఉంచుకోవాలి. స్క్రీన్ షోల తర్వాత మీరు స్టేషన్ కోడ్‌ల కోసం వెతికితే, మీకు టికెట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది.

బెర్త్ సెలక్షన్..

బెర్త్ సెలక్షన్..

కింది దశలో మీరు మీ బెర్త్ ప్రాధాన్యత సెలక్ట్ చేసుకోవలసి ఉంటుంది. మీరు లోయర్ బెర్త్‌ని ఎంచుకుంటే.. అది అందుబాటులో ఉండకపోవడానికి మంచి అవకాశం ఉంది. ప్రక్రియను సులభతరం చేయడానికి మీరు ఎటువంటి బెర్త్ ప్రాధాన్యతలను ఎంచుకోకూడదు.

Read more about: irctc train tickets
English summary

Indian Railways: IRCTCలో కన్ఫమ్ తత్కాల్ టిక్కెట్లు కావాలా..? అయితే ఇలా బుక్కింగ్ చేయండి.. | know how to get confirmed Tatkal Tickets on IRCTC for emergency travel needs

Planning to Travel by Indian Railways know How You Can Get Confirmed Tatkal Tickets on IRCTC
Story first published: Wednesday, August 3, 2022, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X