For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IRCTC: రైల్వే నుంచి నెలకు రూ.80 వేలు ఆదాయం.. ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకోండి.. రిస్క్ లేకుండానే..

|

IRCTC: మీరు ఏదైనా పని కోసం చూస్తున్నట్లయితే.. ఇది అద్బుతమైన సంపాదన అవకాశం అని చెప్పుకోవాలి. ఇందుకోసం మీరు చేయాల్సింది ఆథరైజ్డ్ IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్‌గా మారడం మాత్రమే. దీని ద్వారా నెలకు రూ.80,000 వరకు సంపాదించవచ్చు. IRCTC భారతీయ రైల్వే అనుబంధ సంస్థ. ఇది ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ సేవలు మొదలైనవాటిని నిర్వహిస్తోంది. మీరు IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చనే పూర్తి వివారాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 బుకింగ్ ఏజెంట్‌గా ఎలా మారాలి..?

బుకింగ్ ఏజెంట్‌గా ఎలా మారాలి..?

భారతీయ రైల్వేలో మొత్తం రిజర్వేషన్ టిక్కెట్లలో 55 శాతం ఆన్‌లైన్ మోడ్ ద్వారా బుక్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాబట్టి ఆథరైజ్డ్ IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ గా అవ్వడం వల్ల మీకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది.

అపరిమిత టిక్కెట్ల బుక్..

అపరిమిత టిక్కెట్ల బుక్..

IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు నెలలో ఎన్ని టిక్కెట్లనైనా బుక్ చేయవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ప్రతి బుకింగ్‌పై ఏజెంట్లకు కమీషన్ లభిస్తుంది. ఒక ఏజెంట్ నెలకు రూ. 80,000 వరకు సంపాదించవచ్చు. పని నెమ్మదించినా కనీసం 40-50 వేల రూపాయలు రాబట్టవచ్చు.

ఎలా సంపాదించాలి..

ఎలా సంపాదించాలి..

ప్రతి టికెట్ బుకింగ్‌పై ఏజెంట్‌కు మంచి కమీషన్ లభిస్తుంది. IRCTC ఏజెంట్‌గా.. మీరు నాన్-AC క్లాస్‌లో PNRకి రూ.20, AC క్లాస్‌లో PNRకి రూ.40 పొందుతారు. దీనితో పాటుగా ఏజెంట్లు రూ. 2,000 కంటే ఎక్కువ లావాదేవీ మొత్తంపై 1 శాతం, రూ.2,000 వరకు లావాదేవీ మొత్తంలో 0.75 శాతం చెల్లింపు గేట్‌వే రుసుముగా పొందుతారు.

ఏజెంట్‌గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఏజెంట్‌గా మారడం వల్ల కలిగే ప్రయోజనాలు..

IRCTC ఏజెంట్ అపరిమిత టిక్కెట్‌లను చేయవచ్చు. అన్ని రకాల టిక్కె‌ట్లను బల్క్‌లో బుక్ చేసుకోవచ్చు. సాధారణ పబ్లిక్ బుకింగ్ టైమింగ్‌లు ప్రారంభమైన 15 నిమిషాలలోపు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సౌకర్యం, సులభమైన రద్దు ప్రక్రియ పాలసీ, అన్ని రకాల బుకింగ్ అనుమతించబడిన ప్రయోజనాలు ఉంటాయి. ఏజెంట్‌కు ఆన్‌లైన్ ఖాతాను రైల్వేస్ అందిస్తుంది. దీని ద్వారా వారు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఏజెంట్‌గా ఎలా మారాలంటే..

ఏజెంట్‌గా ఎలా మారాలంటే..

1. ఏజెంట్ కావడానికి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో నింపాలి.

2. సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్, డిక్లరేషన్ ఫారమ్‌తో పాటు ఇతర పత్రాలను స్కాన్ చేసిన కాపీలను పంపాల్సి ఉంటుంది.

3. ఇందుకోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, చెల్లుబాటు అయ్యే ఈ-మెయిల్ ID, ఫోటో, ఆఫీస్ అడ్రస్ ప్రూఫ్, రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్, డిక్లరేషన్ ఫారం, రిజిస్ట్రేషన్ ఫారమ్ అవసరం.

4. అన్ని డాక్యుమెంట్‌లను ధృవీకరించిన తర్వాత, IRCTC ID కోసం రూ.1,180 డిపాజిట్ చేయమని IRCTC సూచిస్తుంది.

5. మీకు డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత OTP, వీడియో వెరిఫికేషన్ చేయబడుతుంది.

6. డిజిటల్ సర్టిఫికేట్ పొందిన తర్వాత.. మీరు IRCTCకి రుసుము చెల్లించాలి. రుసుము స్వీకరించిన తర్వాత.. IRCTC లాగిన్, పాస్ వర్డ్ లాంటి వివరాలను మీకు ఈ-మెయిల్ చేయబడతాయి.

7. ప్రక్రియ పూర్తైన తరువాత మీరు ఆథరైజ్డ్ ఏజెంట్ అవుతారు. దీని ద్వారా మీరు మీ కస్టమర్ల కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేస్తూ సంపాదించడం ప్రారంభించవచ్చు.

Read more about: irctc రైల్వే
English summary

IRCTC: రైల్వే నుంచి నెలకు రూ.80 వేలు ఆదాయం.. ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకోండి.. రిస్క్ లేకుండానే.. | know how to earn 80 thousand rupees monthly from IRCTC by becoming authorized ticket booking agent earn good commission income

know how to earn 80 thousand rupees from IRCTC
Story first published: Friday, July 22, 2022, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X