For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lost Passport: విదేశీ ప్రయాణంలో పాస్‌పోర్ట్‌ పోతే ఏమి చేయాలి..? ఆందోళన చెందకుండా ఈ ప్రక్రియ ఫాలో అవ్వండి..

|

Lost Passport: ఎవరైనా విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు వారి ఫోన్, వాలెట్ లేదా పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకోవడం అనేది అతిపెద్ద సమస్య అని చెప్పుకోవాలి. విదేశాలకు ప్రయాణించేవారికి అతి ముఖ్యమైనది పాస్‌పోర్ట్. ఇది మీరు భారతీయ పౌరుడని విదేశీ అధికారులు నిర్ధారించుకునేందుకు భారత ప్రభుత్వం అందించే అధికారిక గుర్తింపు పత్రం. అలాంటప్పుడు పాస్ పోర్ట్ పోగొట్టుకున్నట్లయితే ఆందోళన చెందకుండా ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

పాస్‌పోర్ట్ పోయినట్లయితే వెంటనే మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, పాస్‌పోర్ట్ కార్యాలయానికి లేదా ఇండియన్ మిషన్‌కు వెల్లడించాలి. అవసరమైతే.. మీరు కొత్త పాస్‌పోర్ట్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అసలు ఈ ప్రక్రియ ఎలా చేయాలో పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకోండి..

పోలీసు ఫిర్యాదు ఫైల్ చేయటం..

పోలీసు ఫిర్యాదు ఫైల్ చేయటం..

మీరు మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారని లేదా అది దొంగిలించబడిందని గ్రహించిన తర్వాత, వెంటనే మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు కాపీని తీసుకోండి. అది మీరు పాస్‌పోర్ట్ కోల్పోయినట్లు రుజువుగా పనిచేస్తుంది. అలాగే.. కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయడం కోసం రాయబార కార్యాలయానికి సంబంధించిన సమయంలో పోలీసులు ఇచ్చిన నివేదిక మీకు సహాయం చేస్తుంది.

సమీపంలోని ఈ కార్యాలయాలను సంప్రదించండి..

సమీపంలోని ఈ కార్యాలయాలను సంప్రదించండి..

తదుపరి ముఖ్యమైన దశ ఏమిటంటే.. సమీపంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించడం. విదేశాల్లో ఇరుక్కుపోయిన లేదా పాస్‌పోర్ట్ పోయినా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న పౌరులకు సహాయం చేయడానికి విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు సహాయం చేస్తాయి. పాస్ పోర్ట్ తిరిగి పొందేందుకు ప్రక్రియను పూర్తి చేయటానికి వారు సహాయం చేస్తారు.

కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు..

కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు..

మీకు రెండు ఎంపికలు ఉంటాయి. మెుదటిది కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవటం కాగా రెండోది ఎమర్జెన్సీ సర్టిఫికేట్ పొందటం. మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. అందుకు కనీసం వారం రోజులు వేచి ఉండాలి. డూప్లికేట్ పాస్ పోర్ట్ కాకుండా కొత్త నంబర్‌తో పాస్‌పోర్ట్ తాజా చెల్లుబాటు సమయంతో అందించటం జరుగుతుంది. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయాల్సిన పత్రాల వివరాలు

* ప్రస్తుత చిరునామాకు రుజువు

* పుట్టిన తేదీ రుజువు

* పాస్‌పోర్ట్ ఎలా ఎక్కడ పోయింది/పాడైనట్లు తెలిపే అఫిడవిట్

* అసలు పోలీసు రిపోర్ట్

ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కావాలంటే..

ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కావాలంటే..

మీరు ఒక వారం పాటు వేచి ఉండలేకపోతే.. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ ప్రయాణ పత్రం పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయ పౌరుడు భారతదేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇవ్వడానికి ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు. మీరు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు..

* పోగొట్టుకున్న పాస్‌పోర్ట్ కాపీ (రెండు వైపులా)

* పోలీసు నివేదిక కాపీ

* పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

వీసా మళ్లీ జారీ కోసం దరఖాస్తు..

వీసా మళ్లీ జారీ కోసం దరఖాస్తు..

మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు మీ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకుంటే.. మీరు కలిగి ఉన్న వీసాను కూడా కోల్పోతారు. మీ వీసాను మొదట జారీ చేసిన సంబంధిత దేశ రాయబార కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా మీరు మీ వీసాను తిరిగి పొందవచ్చు. ఇందుకు మీ పాత వీసా, పోలీసు రిపోర్ట్ కాపీ అవసరం.

చివరిగా ప్రయాణ షెడ్యూలింగ్..

చివరిగా ప్రయాణ షెడ్యూలింగ్..

మీ విమానాన్ని రీషెడ్యూల్ చేసుకోండి. ప్రయాణ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయండి. పైన చెప్పిన విధంగా ప్రయాణ పత్రాలను పొందడానికి మీకు తగినంత సమయం లేకపోతే.. ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించండి. ఈ క్రమంలో షెడ్యూల్ చేసిన విమానాన్ని అందుకోవడం అసాధ్యం కావచ్చు. ఇలాంటి సందర్భంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ సహాయకారిగా ఉండవచ్చు. పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నప్పుడు వెంటనే మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ని వీలైనంత త్వరగా సంప్రదించండి. పాస్‌పోర్ట్ కోల్పోవడం వల్ల అయ్యే ఖర్చులకు సంబంధించిన పోలీస్ రిపోర్ట్, రసీదులను మీ వద్ద ఉంచుకోండి.

Read more about: passport
English summary

Lost Passport: విదేశీ ప్రయాణంలో పాస్‌పోర్ట్‌ పోతే ఏమి చేయాలి..? ఆందోళన చెందకుండా ఈ ప్రక్రియ ఫాలో అవ్వండి.. | know how to deal with situation if you lose your passport while travelling abroad in 5 simple steps

Five things to do if you lose your passport while travelling abroad
Story first published: Monday, July 18, 2022, 12:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X