For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?

|

LIC (లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) తన అనుబంధ LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ పేరుతో స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. నిరుపేద విద్యార్థులకు విద్యా తోడ్పాటు అందిస్తోంది. విద్యార్థులకు ఆయా ప్రభుత్వాలు స్కాలర్‌షిప్స్ అందించే విషయం తెలిసిందే. అయితే LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. LIC HFL వివిధ రకాల సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాధన్ స్కాలర్‌షిప్ గురించి తెలుసుకుందాం...

బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..బిజినెస్‌మెన్ అకౌంట్ నుంచి గ్రామాల్లోని జన్ ధన్ అకౌంట్లోకి..

8వ తరగతి నుంచి పీజీ వరకు

8వ తరగతి నుంచి పీజీ వరకు

- LIC HFL విద్యాధన్ స్కాలర్‌షిప్ 8వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తారు.

- హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఎల్ఐసీ రూ.30,000 వరకు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది.

డిసెంబర్ 31 చివరి తేదీ

డిసెంబర్ 31 చివరి తేదీ

- 8-10 తరగతులకు, 10వ తరగతి పాసైన విద్యార్థులకు, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు వేర్వేరు స్కాలర్‌షిప్స్ ఉంటాయి.

- స్కాలర్‌షిప్ కోసం 31-12-2019 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

- మూడింటికి కూడా చివరి తేదీ మరో రెండు రోజులు (నేడు, రేపు) మాత్రమే మిగిలి ఉంది.

8-10వ తరగతి విద్యార్థులకు.. అర్హతలు

8-10వ తరగతి విద్యార్థులకు.. అర్హతలు

- భారత్‌లో గుర్తింపు పొందిన ఏ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అయినా 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- దరఖాస్తు చేసుకునే విద్యార్థి అంతకుముందు తరగతిలో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి.

- కుటుంబ ఆదాయం రూ.3,00,000 (రూ.3 లక్షలు)కు మించరాదు.

- తక్కువ ఆదాయం ఉన్న వారి ఆధారంగా, క్రైసిస్‌లో ఉన్న విద్యార్థుల (అనాథలు, తీవ్ర అనారోగ్యం మొదలగునవి).. ఈ క్రమంలో ప్రాధాన్యత ఉంటుంది.

- స్కాలర్‌షిప్ అమౌంట్ రూ.10,000

10వ తరగతి పాసైన విద్యార్థులకు... అర్హతలు

10వ తరగతి పాసైన విద్యార్థులకు... అర్హతలు

- భారత్‌లో గుర్తింపు పొందిన ఏ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అయినా 11/12వ తరగతి కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- డిప్లోమా, ఐటీఐ, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

- దరఖాస్తు చేసుకునే విద్యార్థి అంతకుముందు తరగతిలో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి.

- కుటుంబ ఆదాయం రూ.3,00,000 (రూ.3 లక్షలు)కు మించరాదు.

- తక్కువ ఆదాయం ఉన్న వారి ఆధారంగా, క్రైసిస్‌లో ఉన్న విద్యార్థుల (అనాథలు, తీవ్ర అనారోగ్యం మొదలగునవి).. ఈ క్రమంలో ప్రాధాన్యత ఉంటుంది.

- స్కాలర్‌షిప్ అమౌంట్ రూ.15,000

గ్రాడ్యుయేషన్.. అర్హతలు

గ్రాడ్యుయేషన్.. అర్హతలు

- భారత్‌లో గుర్తింపు పొందిన ఏ కాలేజీ లేదా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అయినా గ్రాడ్యుయేషన్/అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

- దరఖాస్తు చేసుకునే విద్యార్థి అంతకుముందు తరగతిలో అంటే క్లాస్ 12 బోర్డు పరీక్షలో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి.

- కుటుంబ ఆదాయం రూ.3,00,000 (రూ.3 లక్షలు)కు మించరాదు.

- తక్కువ ఆదాయం ఉన్న వారి ఆధారంగా, క్రైసిస్‌లో ఉన్న విద్యార్థుల (అనాథలు, తీవ్ర అనారోగ్యం మొదలగునవి).. ఈ క్రమంలో ప్రాధాన్యత ఉంటుంది.

- స్కాలర్‌షిప్ అమౌంట్ రూ.20,000

పోస్ట్ గ్రాడ్యుయేషన్... అర్హతలు

పోస్ట్ గ్రాడ్యుయేషన్... అర్హతలు

- పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ ప్రోగ్రామ్స్‌కు చెందిన ఏ విద్యార్థి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లో గుర్తింపు పొందిన ఏ కాలేజీ లేదా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

- గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

- దరఖాస్తు చేసుకునే విద్యార్థి అంతకుముందు తరగతిలో అంటే యూజీ లెవల్‌లో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి.

- కుటుంబ ఆదాయం రూ.3,00,000 (రూ.3 లక్షలు)కు మించరాదు.

- తక్కువ ఆదాయం ఉన్న వారి ఆధారంగా, క్రైసిస్‌లో ఉన్న విద్యార్థుల (అనాథలు, తీవ్ర అనారోగ్యం మొదలగునవి).. ఈ క్రమంలో ప్రాధాన్యత ఉంటుంది.

- స్కాలర్‌షిప్ అమౌంట్ రూ.30,000

English summary

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది? | Know about LIC HFL vidyadhan scholarship

LIC HFL Vidyadhan Scholarship is a CSR initiative of LIC Housing Finance Limited (LIC HFL) to support the education of underprivileged students in India.
Story first published: Monday, December 30, 2019, 14:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X