For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ అమౌంట్‌‌: ఇక ఇంట్లో నుంచే ఇలా కట్టొచ్చు: వడ్డీ రేటు మాటేంటీ?

|

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసిక వచ్చేసింది. చివరి త్రైమాసికం కావడం వల్ల దేశ ఆర్థిక విధానాలు, రాబడి, జీఎస్టీ వసూళ్లు ఎలా ఉంటాయనే అంశంపై అందరి దృష్టీ నిలిచింది. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాలపై కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపించిన ప్రస్తుత పరిస్థితుల్లో చివరి మూడు నెలల స్థితిగతులు ఎలా ఉంటాయి?, కార్పొరేట్ కంపెనీలు, ఇతర వాణిజ్య సంస్థలు తమ లక్ష్యాన్ని అందుకుంటాయా? లేదా? అనేది చర్చనీయాాంశమౌతోంది.

మార్పుల్లేని పోస్టల్ వడ్డీ రేట్లు..

మార్పుల్లేని పోస్టల్ వడ్డీ రేట్లు..

అవెలా ఉన్నప్పటికీ.. ఈ చివరి త్రైమాసికంలో పోస్టల్ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయనే ఆసక్తి ఖాతాదారుల్లో నెలకొంది. ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలల కాలానికీ ఇందులో మార్పులు చేర్పులు చేస్తుండటం దీనికి కారణం. ఈ సారి కూడా వడ్డీ రేటులో ఎలాంటి మార్పులు నమోదు కాలేదు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది తెలియాల్సి ఉంది.

ఐపీపీబీతో ఆన్‌లైన్ చెల్లింపులు సులభం..

ఐపీపీబీతో ఆన్‌లైన్ చెల్లింపులు సులభం..

మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టాఫీస్ కూడా సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకుంటోంది. ప్రత్యేకంగా- ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా నెలవారీ రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని పోస్టాఫీస్‌కు వెళ్లకుండానే.. అక్కడ గంటల తరబడి క్యూలో నిల్చునే ఇబ్బంది లేకుండా చెల్లించడానికి అవకాశం ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టాఫీస్ వరకూ వెళ్లకుండా నెలవారీ ఆర్డీ మొత్తాన్ని చెల్లించడంపై ఖాతాదారులు ఆసక్తి చూపుతున్నారు.

చెల్లింపు విధానం ఇలా..

చెల్లింపు విధానం ఇలా..

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత.. తొలుత డీఓపీ ప్రొడక్ట్స్ అనే విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే రికరింగ్ డిపాజిట్ అనే అక్షరాలు కనిపిస్తాయి. అందులో ఆర్డీ నంబర్, కస్టమర్ ఐడీని పొందుపరచాలి. ఎంత మొత్తాన్ని చెల్లించాలి? ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అనేది ఎంపిక చేసుకున్న తరువాత అమౌంట్‌ను బదిలీ చేయాలి. నెలవారీ మొత్తాన్ని డిపాజిట్ చేసిన వెంటనే ఆ సమాచారాన్ని పోస్టాఫీస్ నుంచి.. దీనికి సంబంధించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఇంట్లో నుంచే ఈ అమౌంట్‌ను చెల్లించే వెసలుబాటును పోస్టల్ డిపార్ట్‌మెంట్ కల్పించింది.

English summary

పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ అమౌంట్‌‌: ఇక ఇంట్లో నుంచే ఇలా కట్టొచ్చు: వడ్డీ రేటు మాటేంటీ? | India Post Payments Bank app: How to deposit money online in post office RD account

You can deposit money online into Post Office RDs through India Post Payments Bank (IPPB) app. The monthly instalment of RD amount can be transferred online into your RD account through this app.
Story first published: Monday, January 11, 2021, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X