For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ICICI Lombard: టెలిగ్రాంలో సేవలు, వాట్సాప్‌లో కొత్త సేవలు

|

ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ తన పాలసీదారులకు టెలిగ్రామ్ యాప్ ద్వారా సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా టెలిగ్రామ్ యూజర్లు విపరీతంగా పెరుగుతున్నారు. దీంతో వివిధ సంస్థలు టెలిగ్రామ్ వినియోగాన్ని పెంచుతున్నాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సురెన్స్ కూడా టెలిగ్రామ్ ద్వారా కస్టమర్లకు సేవలు అందించనున్నట్లు తెలిపింది. టెలిగ్రామ్ చాట్‌బాట్ సాయంతో మోటార్ క్లెయిమ్స్ నమోదు చేయడంతో పాటు పురోగతి తెలుసుకోవచ్చునని తెలిపింది.

మొట్టమొదటి నాన్-లైఫ్ ఇన్సూరర్

మొట్టమొదటి నాన్-లైఫ్ ఇన్సూరర్

వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా విభిన్న సేవలు సులభతరం అవుతున్నాయి. టెలిగ్రామ్ సేవలు కూడా ఈ తరహావే. మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్, సంస్థలు వినియోగదారుల సౌలభ్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. ఇటీవల టెలిగ్రామ్ వినియోగం పెరిగింది. ఇటీవల ప్రతి నలుగురిలో ఒక భారతీయుడు టెలిగ్రామ్‌ను వినియోగించడం పెరుగుతోంది. దీంతో లక్షలాదిమంది ఈ మెసేజింగ్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ ధోరణిని గుర్తించిన ఐసీఐసీఐ లాంబార్డ్ తన AI-పవర్డ్ చాట్‌బోట్ ద్వారా టెలిగ్రామ్ సహకారంతో స్వీయ-సేవ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాన్-లైఫ్ ఇన్సూరర్‌గా నిలిచింది.

టెలిగ్రామ్ కొత్త సేవలు, వాట్సాప్‌లో మరిన్ని

టెలిగ్రామ్ కొత్త సేవలు, వాట్సాప్‌లో మరిన్ని

టెలిగ్రామ్ చాట్‌బాట్ వినియోగదారులకు సులభమైన, సౌకర్యవమైన సేవలను అందిస్తుంది. ఉదాహరణకు మోటార్ క్లెయిమ్, ట్రాకింగ్ క్లెయిమ్ స్టేటస్, బీమా పాలసీని పునరుద్ధరించడం, పాలసీ పత్రాన్ని డౌన్‌లోడ్ చేయడం, పాలసీ వివరాలను సవరించడం వంటి సౌకర్యాలు లేదా సేవలను పొందవచ్చునని ఆగస్ట్ 2వ తేదీన విడుదల చేసిన ICICI లోంబార్డ్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అలాగే, ఈ సంస్థ వాట్సాప్ ప్లాట్‌ఫాం ద్వారా పలు సేవలను జోడించింది. ఈ కొత్త సేవల్లో భాగంగా కస్టమర్లు క్లెయిమ్ స్టేటస్, క్లెయిమ్‌కు సంబంధించిన అప్-లోడ్ డాక్యుమెంట్స్ వంటి అంశాలపై వెంటనే సమాధానం దొరుకుతుంది.

ఉదాహరణకు మోటార్ క్లెయిమ్ నమోదు చేయడానికి వినియోగదారుడు కేవలం వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఘటన జరిగిన తేదీ, సమయం, స్థానాన్ని నమోదు చేయాలి. దీనిని 7738282666 వాట్సాప్ నెంబర్ ద్వారా సంభాషించవచ్చు.

ప్రెండ్లీ సేవలు

ప్రెండ్లీ సేవలు

ఈ యూజర్ ఫ్రెండ్లీ సేవలను ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వినియోగించుకోవచ్చు. దీనిపై ఐసీఐసీఐ లాంబార్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి మాట్లాడుతూ... మనం టెక్నాలజీ యుగంలో ఉన్నామని, ప్రస్తుత వినియోగదారులు తక్షణ పరిష్కారం, కాంటాక్ట్‌లెస్ పద్ధతులను కోరుకుంటున్నారని తెలిపారు.

తమ టెలిగ్రామ్ ద్వారా AI ఎనేబుల్ చాట్‌బోట్ సేవలు, వాట్సాప్‌లో కొత్త సేవలు తక్షణ పరిష్కారం, కాంటాక్ట్‌లెస్ పద్ధతికి మరో అడుగు అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో తమ కస్టమర్లకు గ్రూప్ బీమా పాలసీ గ్రూప్ సేఫ్‌గార్డ్‌ను అందించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ లాంబార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

గ్రూప్ సేఫ్‌గార్డ్ పాలసీతో కస్టమర్లు ఆసుపత్రిలో చేరితే రూ.500 నుండి పెద్ద మొత్తాలను హాస్పిక్యాష్‌గా పొందే వెసులుబాటు ఉంటుంది. నిర్ణయించిన రోజువారీ మొత్తంతో కస్టమర్లకు వైద్య, అత్యవసర వ్యయాలకు చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్, ఐసీఐసీఐ లాంబార్డ్ తెలిపాయి. ఈ బీమా పాలసీని అందుబాటు ధరలో తెచ్చినట్లు, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరినా, ఆపరేషన్/ఇతర చికిత్సలకు ఉపయోగపడుతుంది.

English summary

ICICI Lombard: టెలిగ్రాంలో సేవలు, వాట్సాప్‌లో కొత్త సేవలు | ICICI Lombard insurance service on Telegram: Know the details

ICICI Lombard has launched self service facilities on Telegram. The Telegram chatbot offers convenient facilities to customers such as registering a motor claim, tracking claim status, renewing an insurance policy, downloading policy documents, modifying the policy details, among others.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X