For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీకోసమే ఈ టిప్స్...

|

ఉద్యోగం రాగానే చాలా మంది సంబరపడిపోతారు. ఇన్నాళ్లు తల్లిదండ్రుల సంపదపై ఆధారపడిన తాము ఇకపై ఎవ్వరిపై ఆధారపడాల్సిన అవసరం లేదని, ఇష్టారాజ్యంగా ఖర్చు చేసుకోవచ్చని అనుకుంటారు. మొదటి నెల జీతం బ్యాంకు ఖాతాలో పడగానే పార్టీకి ప్లాన్ చేస్తారు. దోస్తులందరిని పిలిచి ఖాతాలో సొమ్ము ఖాళీ అయ్యేదాకా ఖర్చుపెడతారు. సినిమాలు, షికార్లకు అడ్డు అదుపు అనేదే ఉండదు. ఎలాగూ జీతం వస్తుంది కదా అని ముందే అప్పులు చేసే ప్రభుద్దులు కూడా ఉంటారు. కొన్ని కొత్త అలవాట్లు చేసుకునే వారు కూడా లేకపోలేదు. డబ్బులు ఉన్నదే ఎంజాయ్ చేయడానికి అని వచ్చిన జీతం మొత్తం ఖతం చేస్తారు. అసలు వీళ్లకు భవిష్యత్ గురించిన ఆలోచన గానీ, భయంగానే ఉండదు. ఇలా ఉండటం వల్ల జీవితం గాడి తప్పే ప్రబంధం ఉంటుంది. కానీ ఒక వేళ ఉద్యోగం పోయే పరిస్థితి వస్తే అప్పుడు ఏమిటీ అన్నది ఎంత మాత్రం ఆలోచించరు. ఒకవేళ ఉద్యోగం గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొంటే ఎలా? అందుకే ముందు జాగ్రత్తగా కొన్ని పద్దతులను పాటించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. అవేమిటంటే...

మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?మీకు ఈ స్కాలర్‌షిప్ గురించి తెలుసా? 2 రోజులో మిగిలి ఉంది?

ముందు పొదుపు చేయండి..

ముందు పొదుపు చేయండి..

యంగ్ ఏజ్ లో ఉన్నపుడు అనేక కోరికలు ఉంటాయి. ఖరీదైన స్మార్ట్ ఫోన్, డ్రెస్సులు, బైక్ కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. సినిమాలు, హాలీడే ట్రిప్పులు, దోస్తులతో పార్టీలు కూడా ఉంటాయి. దీనివల్ల వచ్చే జీతంలో అధిక భాగం ఖర్చయిపోతుంది. ఇక మిగిలేది చాలా తక్కువ. అందుకే ఖర్చులు చేసే సమయంలో కాస్త ఆలోచించడం మంచిది. మీ జీతంలో ఎంతో కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. రీకరింగ్ డిపాజిట్ లాంటి దాంట్లో ప్రతి నెలా కొంత మొత్తం జమచేయండి. దీనిపై వడ్డీ కూడా వస్తుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

కొంత మొత్తం జమ అయిన తర్వాత దాన్ని పెట్టుబడుల కోసం ఉపయోగించుకొని మీ ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చు.

* తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టదలచుకుంటే క్రమానుగత పెట్టుబడి పథకాలను ఎంచుకోవచ్చు.

* లేదా బంగారం ఈటీఎఫ్ లు కొనుగోలు చేయవచ్చు.

బీమా మరవొద్దు..

బీమా మరవొద్దు..

ఈ రోజుల్లో ఆరోగ్య బీమా, జీవిత బీమా తప్పనిసరిగా మారిపోయాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి మీ కుటుంబ అవసరాలకు తగిన విధంగా జీవిత బీమా తీసుకోవడం మంచిది. ఆరోగ్య బీమా అవసరం కూడా పెరుగుతోంది. కాబట్టి వీలైనంత త్వరగా వీటిని తీసుకోవడం మంచిది.

అత్యవసర నిధి...

అత్యవసర నిధి...

కొన్ని సందర్భాల్లో డబ్బు అత్యవసరం ఉంటుంది. అప్పుడు ఎవరిని అడిగినా పైసా పుట్టదు. కొంత మంది ఇస్తా అని హామీ ఇచ్చినా అది సరైన సమయంలో చేతికి అందకపోవచ్చు. అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి అత్యవసరాల కోసం కొంత కొంత మొత్తాన్ని పక్కన బెట్టండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

కార్డుల విషయంలో జాగ్రత్త

కార్డుల విషయంలో జాగ్రత్త

ఉద్యోగం రాగానే బ్యాంకులు క్రెడిట్ కార్డు తీసుకోమని వెంటపడుతుంటాయి. వీటిని తీసుకొని కొంత మంది విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఆ తర్వాత ఆ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడతారు.కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకున్నా దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దేన్నీ సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

వాయిదాల్లో కొనుగోళ్లు వద్దు

వాయిదాల్లో కొనుగోళ్లు వద్దు

కొంతమంది తమకు నచ్చిన ఫోన్ లేదా బైక్ లేదా మరేదైనా కొనుగోలు చేసేందుకు వాయిదాల చెల్లింపు సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే దీనివల్ల కొన్ని సార్లు ఇబ్బందులు రావచ్చు. ఒక్కొక్కప్పుడు వాయిదాలు చెల్లించే పరిస్థితి ఉండకపోవచ్చు. అప్పుడు మీరు డిఫాల్టర్ గా మారవచ్చు. దీనివల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బందులు కలుగుతాయి.. అందుకు ఇలాంటి దాన్ని ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.

English summary

కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీకోసమే ఈ టిప్స్... | Have you joined in a new job, do these things for your future

Getting a new job is a happy movement in every ones life. But whenever you joined in a job must follow some financial tips for your future. saving money, Investments, Insurance, emergency fund etc are very important.
Story first published: Saturday, January 4, 2020, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X