For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైవ్ ఫోటో, బయోమెట్రిక్ సేకరణ: ఆధార్ తరహాలో జీఎస్టీ రిజిస్ట్రేషన్

|

జీఎస్టీ ఆన్‌లైన్ నమోదుకు అప్పటికి అప్పుడు తీసే లైవ్ ఫోటో, వేలిముద్రలు వంటివి తప్పనిసరి చేయాలని, అప్పుడే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను నివారించవచ్చునని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సిఫార్సు చేశారు. ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఆదాయపు పన్ను రిటర్న్స్, తగినంత ఆర్థిక స్థోమతలేని వ్యక్తిని నేరుగా పరిశీలించడం, ఎవరినైనా గుర్తించడం వంటివి ఉండాలని జీఎస్టీ లా మండలి సూచించింది. కొత్తగా జీఎస్టీ నమోదుకు ఆధార్ వంటి పద్ధతులు అనుసరించాలని, ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపింది. ఈ సదుపాయాలు బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, జీఎస్టీ సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచన చేసింది.

కార్పోరేట్... ప్రయివేటు బ్యాంకుల్లో కీలక సంస్కరణలు: వాటా 26% శాతానికి పెంపుకార్పోరేట్... ప్రయివేటు బ్యాంకుల్లో కీలక సంస్కరణలు: వాటా 26% శాతానికి పెంపు

నకిలీ బెడద ఉండకుండా

నకిలీ బెడద ఉండకుండా

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తోన్న నకిలీ సంస్థల బెడదను నివారించేందుకు లైవ్ ఫోటో, బయోమెట్రిక్ ఉపయోగించి ఆన్‌లైన్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలని కేంద్ర, రాష్ట్ర ట్యాక్స్ అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. నాన్-ఆధార్ అథెంటికేషన్ ఆధారిత రిజిస్ట్రేషన్ పద్ధతిని ఎంచుకుంటే ఫిజికల్ వెరిఫికేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం అవసరమని తెలిపింది. అలాగే, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే నేరుగా పరశీలించవచ్చునని తెలిపింది.

సిఫార్సు లేఖలు

సిఫార్సు లేఖలు

నాన్-ఆధార్ ధృవీకరణ ప్రక్రియను ఎంచుకోవడంతో పాటు ఐటీ రిటర్న్స్ సమర్పించకుంటే సదరు వ్యాపారి ఆఫీస్ లేదా వ్యాపార చిరునామాను తప్పనిసరిగా భౌతికంగా తనిఖీ చేయాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యాపారి ఇద్దరు పన్ను చెల్లింపుదారుల సిఫార్సు లేఖలను కూడా ఇవ్వాలని తెలిపింది. సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా వ్యాపారి విశ్వసనీయ వ్యక్తుల జాబితాలోకి వస్తే ఏడు రోజుల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ గుర్తింపు ఇవ్వాలని, జాబితాలోకి రాకుంటే 60 రోజుల్లో.. అదీ భౌతిక తనిఖీలు జరిపి, షరతులతో ఇవ్వాలని తెలిపింది.

ఆధార్ తరహా

ఆధార్ తరహా

నకిలీ ఇన్వాయిస్‌లను అరికట్టేందుకు ఆధార్ తరహాలో ఆన్‌లైన్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అవలంభించాలని కమిటీ సూచించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరు నెలల పాటు రిటర్న్స్ దాఖలు చేయని వారిని ప్రామాణాల ఆధారంగా గుర్తించాలని కమిటీ సూచించింది. కాగా జీఎస్టీలో 6 లక్షల మంది డోర్‌మాంట్ రిజిస్ట్రాంట్స్ ఉన్నారు.

English summary

లైవ్ ఫోటో, బయోమెట్రిక్ సేకరణ: ఆధార్ తరహాలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ | GST Council's law panel suggests live photo, biometrics

Central and state tax officials have suggested the option of online GST registration with live photo and use of biometrics to weed out the menace of fake firms claiming input tax credit, sources said.
Story first published: Monday, November 23, 2020, 10:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X